News and Entertainment

స్వర్గానికి, నరకానికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా?


అనగనగా ఓ స్కూల్…. అందులో  ఓ పిల్లాడికి ఏదైనా కొత్త విషయం తెల్సుకోవాలంటే చాలా ఇష్టం.ఈ క్రమంలో ఓ రోజు ఆ పిల్లాడు తన టీచర్ తో …..టీచర్ ,టీచర్… స్వర్గం అంటే ఏమిటి? నరకం అంటే ఏమిటి? అసలు రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటి? అని అడుగుతాడు. అందుకు టీచర్ సరే…పిల్లలు రేపు ఉదయం అందరూ త్వరగా వచ్చేయండి…మీకు స్వర్గాన్ని, నరకాన్ని చూపిస్తా… వాటిని చూశాక ఆ తేడా ఏంటో మీరే స్వయంగా నాకు చెప్పండి అంటోంది టీచర్.

మరుసటి రోజు పిల్లలంతా ఉత్సాహంగా స్కూల్ కు వస్తారు. అన్నమాట ప్రకారం పిల్లల్ని మొదటగా నరకాన్ని చూపించడానికి తీసుకెళుతుంది టీచర్.

వీళ్లు వెళ్లిన సమయంలో….. అక్కడ లంచ్ టైమ్ కావడంతో… నరకంలో ఉన్నవాళ్లంతా భోజనాలకు కూర్చుంటారు. వారి, వారి ప్లేట్లలో…..పంచభక్ష పరమన్నాలుంటాయి. కానీ వాటిని తినలేక పోతుంటారు అక్కడి వారు…దానికి కారణం వారందరి చేతికి ఇనుప ముల్లులతో కూడిన కడియాలు వేస్తారు. తిందామని పదార్థాలను చేతితో దగ్గరికి తీసుకొని తినేలోపు…ఆ చేతికడియానికి ఉన్న ముళ్లులు మూతికి కుచ్చుకుంటుంటాయి. వీటి కారణంగా ప్లేట్లో పంచభక్షపరమన్నాలు ఉన్నప్పటికీ…అర్థాకలితోనే పూటగడుపుకోవాల్సి వస్తుంది నరకంలో ఉన్నవాళ్లకు.


ఇప్పుడు టీచర్  పిల్లలందరినీ….స్వర్గానికి తీసుకెళుతుంది..ఇక్కడ కూడా సేమ్ నరకం లాగే ఉంటుంది. ఇక్కడి వారి చేతికి కూడా ముళ్ల కడియాలు వేయబడి ఉంటాయ్, వీరి ప్లేట్లలో కూడా పంచభక్షపరమన్నాలుంటాయ్.. అయినప్పటికీ వీరు హాయిగా, ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా తమ ముందున్న ఆహారాన్ని కడుపునిండా తింటుంటారు.

ఇప్పుడు….టీచర్ పిల్లలతో….పిల్లలూ మీరేం  గమనించారు.?  అని అడిగింది. అప్పుడు పిల్లలు….. నరకంలోని వారి చేతికి ఇనుపముళ్లుల కడియాలు ఉన్నాయి, స్వర్గంలో ఉన్న వారి చేతికి కూడా ఇనుపముళ్లుల కడియాలు ఉన్నాయి, వారి ముందు పంచభక్ష పరమన్నాలు,వీరి ముందు కూడా అవే…అయితే అక్కడి వారు తినలేక పోయారు, ఇక్కడ వారు కడుపునిండా తిన్నారు.

ఇదెలా సాధ్యం అయ్యిందంటే..నరకంలోని వాళ్లు తినడానికి ట్రై చేసినప్పుడు  చేతి కడియపు ముళ్లులు వారి మూతికి గుచ్చుకున్నాయి. స్వరంలోని వారు…తాము తినకుండా తమ ముందు వారికి తినిపిస్తున్నారు. స్వర్గంలోని వారంతా.. ఇలా ఒకరికొకరు తినిపించుకున్నారు…దీని కారణంగా చేతి కడియానికున్న ముళ్ళులు వీళ్లకు గుచ్చుకోలేదు….తామే తినడానికి ట్రై చేసిన నరకంలోని వారికి మాత్రం అవి గుచ్చుకున్నాయి.

అంటే…..మనిషి  పరోపకారంతో మెలగడమే స్వర్గం, స్వార్థాన్ని కలిగి ఉండడమే నరకమంటూ ముగిస్తుంది టీచర్.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...