News and Entertainment

ఎక్కువ మంది గ‌ర్ల్ ఫ్రెండ్స్ ప‌డాలంటే ఇలా చెయ్యాలట


మ‌న స్నేహితుల్లో చాలా మంది ఒక‌రికి మించిన గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ను మెయింటైన్ చేస్తుంటారు. అప్పుడు మ‌న ఫ్రెండ్స్ స‌ర్కిల్స్‌లో ఈ టాక్ ఎక్కువ‌గా వినిపిస్తుంటుంది. అరె..వీడికి అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఎలా పడతారు రా?. వాడు చదువులో ఫస్ట్ కాదు..అందంలో అంతంత మాత్రమే. అన్నీ ఉన్నా మనకు మాత్రం ఒక్క అమ్మాయి పడదేంటిరా? అన్న చ‌ర్చ‌లు బాగా పెడ‌తాం. అయితే ఇందులోనే అస‌లు కిటుకు ఉంది.

అమ్మాయిల‌తో మాట్లాడ‌డం అనేది చాలా హార్ట్ ట‌చ్చింగ్ ఉండాలి. ఇది అంద‌రికి వ‌చ్చేది కాదు. అది ఓ క‌ళ‌లాంటిద‌ట‌. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివర్శిటీ పరిశోధన నిర్వహించింది. మామూలుగా కొంతమంది అబ్బాయిల చుట్టూనే అమ్మాయిలు ఎక్కువగా తిరుగుతారు. కొంతమంది అబ్బాయిలకే ఎక్కువ మంది గాళ్‌ఫ్రెండ్స్‌ ఉంటారు. అయితే ఇందుకు కార‌ణాలేంట‌నేది ఆస్ర్టేలియా వ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.



తాము చెప్పింది విని..తమ ఎమేషన్స్ ను గౌరవించే వారితోనే అమ్మాయిలు ఎక్కువ స్నేహం చేస్తున్నారని తేల్చారు. అయితే అబ్బాయిలు మాత్రం వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. 15 సంవత్సరాల వయసు కలిగిన 1970 మంది యువతీయువకులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో అమ్మాయిలను తమ బెస్ట్‌ మేల్‌ ఫ్రెండ్స్‌ గురించి, అబ్బాయిలను తమ బెస్ట్‌ ఫిమేల్‌ ఫ్రెండ్స్‌ గురించి రాయమని అడిగారు. ఈ సర్వేలో ఎక్కువ మంది అమ్మాయిలు తమ ఎమోషన్స్‌ ను అర్థం చేసుకుని, మెంటల్‌ సపోర్ట్‌ అందించే అబ్బాయిల‌తోనే ఎక్కువ‌గా స్నేహం చేస్తున్నామని ఎక్కువ మంది పేర్కొన్నారట. అయితే అబ్బాయిలు తమ ఫిమేల్‌ ఫ్రెండ్స్‌ ను ఎంచుకోవడంలో మాత్రం ఈ కారణానికి ప్రాధాన్యం ఇవ్వలేదట.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...