News and Entertainment

ప్రతీ అబ్బాయీ, అమ్మాయి తప్పక చదవండి (Must Read & Share)


‘ఒరేయ్.. ఒసేయ్..’ అని సినిమాల్ని చూసి inspire అయి మాట్లాడుకోవడం.. ఛాట్ చేసుకోవడం సరదాగానే ఉంటుంది..

కానీ ఆ సరదా జీవితాల్ని బలి తీసుకుంటోంది…


ఇవ్వాళ ఒకమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం డీల్ చెయ్యాల్సి వచ్చింది.. ఇలాంటివి ఇప్పటికి ఓ పదీ, పదిహేను కేసులు నా దృష్టికి వచ్చాయి..

ఆ అమ్మాయి పెళ్లయి నెలన్నర మాత్రమే అయింది… పెళ్లవగానే భర్త సింగపూర్‌ వెళ్లిపోయాడు, భార్యని తర్వాత తీసుకు వెళ్లే ప్లాన్‌తో. అంతలో ఈ అమ్మాయి మెయిల్, ఐడి, పాస్‌వర్డ్ ద్వారా పాత ఛాట్ హిస్టరీ మొత్తం తిరగేస్తే ఓ అబ్బాయితో ఛాట్ చేసిన మాటలు సమస్య సృష్టించాయి. “ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా” అని అనుమానం మొదలెట్టాడు.


ఇక్కడ ఎవ్వడికీ జీవితంపై బాధ్యత లేదు.. అమ్మాయిలకు తలనొప్పి వస్తే జండూబామ్‌లు రాసే బాయ్ ఫ్రెండ్స్ కావాలి.. అబ్బాయిలకు కొద్దిగా రొమాంటింగ్‌గా మాట్లాడడానికి కోపరేట్ చేసే అమ్మాయిలు కావాలి… ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటారు. కానీ ఆ మాటలు ఎంతవరకూ కరెక్ట్ అన్నది ఎవడికీ పట్టదు!!

రేపు పెళ్లయ్యాక మీ భార్య ఇలాగే వేరొకరితో మాట్లాడి ఉందీ అని తెలిస్తే తట్టుకోవడం అబ్బాయిలకు సాధ్యమవుతుందా? మీ భార్యల్ని క్షమించలేని వాళ్లు ఎవరో ముక్కూ మొహం తెలీని అమ్మాయిలతో ఎందుకు మాటల్లోనే మానసిక వ్యభిచారం చేసేస్తారు?

అమ్మాయిలూ ఏం తక్కువ తినట్లేదు.. మంచిగా, బుద్ధిగా ఉండేవాళ్లు అమ్మాయిలకు నచ్చట్లేదు. కొద్దిగా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి… ఎంత అడ్వాన్స్‌డ్ అంటే సినిమాలకూ, షికార్లకీ తిప్పుతూ ముద్దులూ, హగ్‌లూ ఇచ్చే బాపతు జనాలే నచ్చుతున్నారు.. ఏ మూమెంటో కాలు జారినా ఫర్లేదు.. నష్టం ఏం లేదు..

సిగ్గుపడాల్సి వస్తోంది భారతదేశ పతనాన్ని చూసి! తమ జీవితాల్ని తామే సర్వనాశనం చేసుకుంటున్న యువతని చూసి!!కంప్యూటర్లూ, ఇంటర్నెట్లూ, మొబైల్ ఫోన్లూ, ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నది విచ్చలవిడిగా ఏదిబడితే అది మాట్లాడుకోవడానికి కాదు.. అలా మాట్లాడుకోవడం సరదానూ కాదు.. అలాంటి మాటలే రేపు మీ జీవితాలకు ఉరితాళ్లు కాబోతున్నాయి.

మీరేం చేయాల్సిన పనిలేదు.. చనువుగా ఒక్క వ్యక్తితో మాట్లాడితే చాలు.. అనుమానం ఇట్టే పుట్టుకొస్తుంది.. మీ భార్యా, మీ భర్తా మిమ్మల్ని అనుమానించినంత మాత్రాన వాళ్లు ఇరుకైన ఆలోచనలు కలిగిన వాళ్లూ కాదూ.. మీరు విశాల హృదయులూ కాదు. ఈ సిస్టమ్ ఇంతే… మీరేదో గొప్ప అని ఫీలవకండి… మీ పార్టనర్ అనుమానించకుండా గౌరవంగా ఉండాల్సిన బాధ్యతా మీది, మీ పార్టనర్‌కి అనుమానం వచ్చినా మీ ప్రవర్తనతో సంభాళించుకుని మళ్లీ మామూలు అవ్వాల్సిన బాధ్యతా మీ పార్టనర్‌ది.

అంతే గానీ.. “వాడెడడు నన్ను అనుమానించడానికి.. నిన్నగాక మొన్న తాళికట్టాడు.. నాకు ఈ మనిషే వద్దు.. నేను సంపాదించుకోవట్లేదా.. నా బ్రతుకు బ్రతకలేనా..” అని ఏటిట్యూడ్ చూపించదలుచుకున్నారా? మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నట్లు! చేయాల్సిదంతా మీరే చేసి తప్పు ఎవరిదో అన్నట్లు ఉండడం ఎలా కరెక్ట్?


చివరిగా ఒక్క మాట…

ఈ దేశంలో కొన్ని కోట్ల దంపతులు జీవితాంతం కలిసి ఉన్నారు తరతరాల నుండీ… కలిసి బ్రతకడానికీ, కుటుంబ వైవాహిక జీవనానికీ అర్థం నేర్పిందీ సంస్కృతి.. దీన్ని మీ అజ్ఞానంతో రోజుకో మనిషితో కలిసి బ్రతికే దారుణమైన స్థితికి దిగజార్చకండి.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...