News and Entertainment

కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజినీరు కావాలని కలలు కనడం ఎందుకో ?


నేను కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాను . ఎంత కోపంతో వచ్చానంటే  నాన్న బూట్లు వేసుకు వచ్చేశానని కూడా చూసుకోలేదు.

కొడుక్కి ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజినీరు కావాలని కలలు కనడం ఎందుకో ?
చాలా పెద్దవాడినయ్యాక కాని తిరిగి ఇంటికి వెళ్ల‌ను.

నాకు ఎంత కోపం వచ్చిందంటే.. ఎప్పుడూ ముట్టుకోనివ్వని నాన్న పర్సు కొట్టుకొచ్చేశాను. అమ్మకి కూడా తెలియకుండా రాసే లెక్కలన్నీ దాన్లోనే ఉన్నాయి. ఇవాళ నాకు అవన్నీ తెలిసిపోతాయి.

నడుస్తుంటే బూట్లులో ఏదో తగులుతోంది . కరుస్తున్న‌ట్లు అనిపించింది . బూటు లోపల మెత్తగా లేదు. మడమ నొప్పెడుతోంది. అయినా నా కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు. లోపల తడితడిగా అనిపించింది. కాలు ఎత్తి చూశాను. బూటు అడుగున సోల్ లేదు. చిన్న కన్నం.. కుంటుతూనే బస్ స్టాండ్ కు వచ్చాను
.
గంట దాకా బస్సు ఏదీ లేదట. సరే ఏం చేస్తాం. నాన్న పర్సులో ఏముందో చూద్దామని తెరిచాను. ఆఫీసులో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు, లాప్ టాప్ బిల్లు. ఆ లాప్ టాప్ నా టేబుల్ మీద ఉంది .


ఆఫీసుకు వచ్చేటపుడు శుభ్రమైన బూట్లతో రమ్మంటూ మేనేజర్ ఇచ్చిన మెమో. అవును అమ్మ నాలుగు నెలలనుండి ప్రతీ నెలా ఫస్ట్ తారీఖున చెబుతోంది. కొత్త బూట్లు కొనుక్కోండి అని. ఇంకో ఆరు నెలలు వస్తాయిలే అంటున్నాడు నాన్న .
.
పాత స్కూటర్ తెండి - కొత్త మోటార్ సైకిల్ తో వెళ్లండి.. గొప్ప ఎక్స్చేంజ్ మేళా.. అనే పాంప్లెట్ కనబడింది. అవునూ! నాన్న స్కూటర్ కనబడలేదేంటి??
.
నాకు కళ్లు తిరిగాయి. వెంటనే ఇంటికి పరుగు పెట్టాను. ఈసారి బూట్లు నొప్పెట్ట‌లేదు .
.
ఇంట్లో నాన్న లేడు.. స్కూటర్ లేదు.. నాకు అర్థమైంది. కళ్లు చెమరుస్తున్నాయి. పరుగు పరుగున ఎక్స్చేంజి ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్లాను. అక్కడే ఉన్నాడు నాన్న!
.
నాన్న భుజం తడిపేశాను .
"వద్దు నాన్నా! వద్దు.. నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా!!"

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
                                                    


loading...