News and Entertainment

అంత‌రిక్షంలో వ్యోమ‌గాములు తిన‌డం, తాగ‌డం, బ్ర‌ష్ చేసుకోవ‌డం వంటి ప‌నుల‌ను ఎలా చేస్తారో తెలుసా..?


స్కూల్లో, కాలేజీలో చదువుకున్న గురుత్వాక‌ర్ష‌ణ సిద్ధాంతం మీకు గుర్తుందా..? అదేనండీ, భూమిపై ఏ వ‌స్తువును పైకి వేసినా అది మ‌ళ్లీ తిరిగి భూమి పైనే ప‌డుతుంది. భూమికి ఉన్న గురుత్వాక‌ర్ష‌ణ బ‌లం వ‌ల్లే అలా వ‌స్తువులు మ‌ళ్లీ కింద‌కి వ‌స్తాయి. అవును, అయితే ఏంటంటారా..? ఏం లేదండీ, భూమికి ఉన్న గురుత్వాక‌ర్ష‌ణ బ‌లం వ‌ల్ల మ‌నం భూమిపై ఉండ‌గ‌లుగుతున్నాం. అన్ని ప‌నులు చేయ‌గ‌లుగుతున్నాం. మ‌రి గురుత్వాక‌ర్షణ బ‌లం అత్యంత త‌క్కువ‌గా లేదా అస‌లు ఆ బ‌లం లేని ప్ర‌దేశంలో ఎలా ఉండ‌గ‌ల‌మో ఆలోచించ‌గ‌ల‌రా..? ఉండ‌గ‌లం, కానీ అప్పుడు మ‌నం గాల్లో తేలుతూనే ఉంటాం. 

అన్ని వ‌స్తువులు తేలుతూనే ఉంటాయి. అంత‌రిక్షంలోని ప్ర‌త్యేక నౌక‌ల‌లో ఉండే వ్యోమ‌గాముల‌కు కూడా సరిగ్గా ఇలాగే అవుతుంది. అయితే మ‌రి వారు తిన‌డం, బ్ర‌ష్ చేసుకోవ‌డం, వాంతి చేసుకోవ‌డం వంటి ప‌నులు ఎలా చేస్తారు..? అప్పుడ‌న్నీ గాల్లోనే తేలుతూనే ఉంటాయి క‌దా, అప్పుడు వారికి ఇబ్బంది అవుతుంది క‌దా..? అన‌బోతున్నారా..? అవును, మీరు చెప్పింది నిజ‌మే. అయితే వారి కోసం కొన్ని ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు ఉంటాయి. ఇంత‌కీ అవేంటో తెలుసా..?
loading...