News and Entertainment

గ్యారేజ్ సాంగ్ లీక్.. వాళ్లే చేశారా..!


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న జనతా గ్యారేజ్ నుండి సాంగ్ ఒకటి లీక్ అయినట్టు తెలుస్తుంది. ఇది సినిమాలోని ఒరిజినల్ సాంగే ఎందుకంటే దేవి ఆలపించిన ఈ సాంగ్ తన మార్క్ కనబడేట్టు అదరగొట్టేస్తుంది. అయితే ఈ సాంగ్ లీక్ విషయంలో కొన్ని అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే సాంగ్ రిలీజ్ చేసింది వాళ్లే అని అందరు అనుకుంటున్నారు.

ఇంతకీ జనతా గ్యారేజ్ సాంగ్ లీక్ చేసింది ఎవరని అంటే.. ఇంకెవరు ఆ సినిమా వాళ్లే.. దేవి కంపోజ్ చేసున యాపిల్ బ్యూటీ అనే ఈ సాంగ్ ఎక్కడ లీక్ అన్నట్టు కనిపించట్లేదు. ఆడియో ట్రాక్ యాజిటీజ్ దించేశారు. సో పబ్లిసిటీ కోసం లీక్ అని ఒరిజినల్ సాంగ్ లీక్ చేసుంటారని టాక్. అయితే ఈ సాంగ్ లీక్ పట్ల తమకు తెలియన్నట్టు ఉంది చిత్రయూనిట్ పరిషితి.


నిజంగా లీక్ అయిన విషయం తెలియగానే ఏదో ఒకటి హడావిడి చేసే చిత్రయూనిట్ కామ్ గా ఉన్నారంటే ఇది వారి పనే అంటున్నారు. ఇక లీక్ అయిన సాంగ్ మాత్రం దేవి మరోసారి హుశారెత్తించే మ్యూజిక్ అందించాడనంలో సందేహం లేదు అనిపిస్తుంది. ఇప్పటికే టీజర్ తో సంచలనాలను సృష్టిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

ఇక ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు అత్యంత భారీ మొత్తంతో ఏకంగా 17 కోట్ల కు సొంతం చేసుకున్నాడట. సాధారణంగా సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేసే దిల్ రాజు కొరటాల శివ, తారక్ మీద ఉన్న నమ్మకంతో అంత పెద్ద మొత్తం పెట్టి సినిమా కొనేశాడు. ఇక గ్యారేజ్ లో లీక్ అయిన సాంగ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. http://picosong.com/tXPm/

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...