News and Entertainment

నిహారిక ఆ పాత్ర చేయనుందా..!


తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తున్న విషయం తెలిసిందే..మొదటి సారిగా నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి నుంచి సినిమా కుటుంబ నేపథ్యంలో పెరిగిన నిహారిక హీరోయిన్ గా రావాలని బలమైన కోరికను మొదట్లో మెగా ఫ్యామిలీ కాదన్న తర్వాత ఆమెలోని ఉత్సాహాన్ని చూసి సపోర్ట్ చేసింది. అయితే ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేదు కానీ నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఈ చిత్రంలో నాగశౌర్య సరసన నటించిన నిహారిక అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులచే షెబాష్ అనిపించుకుంది కానీ కథలో బలం లేకపోవడం సినిమా అంతా కాస్త పేలవంగా ఉండటంతో రిలీజ్ అయిన మొదటి రోజూ బ్యాట్ టాక్ వచ్చింది. అప్పటి వరకు మెగా అమ్మాయి ఈ చిత్రంపై ఎన్నో అశాలు పెట్టుకోవడం అది కాస్త డిజాస్టర్ కావడంతో ఇక కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు తనకు మొదటి నుంచి అచ్చొచ్చిన షార్ట్ ఫిలిమ్స్ పై దృష్టి పెడుతున్నట్లు పుకార్లు వచ్చాయి.


కానీ వీటన్నిటికి కొట్టిపడేస్తూ నిహారిక మరో సినిమాకు రెడీ అయ్యింది. మారాఠీలో అద్భుత విజయం సాధించిన ‘హ్యాపీ జర్నీ’ చిత్రాన్ని తెలుగు లో రిమేక్ చేయోబోతున్నారట. ఈ చిత్రం ‘సినిమా చూసిస్త మావ’ చిత్రాన్ని నిర్మించిన బెక్కం వేణు గోపాల్ నిర్మించబోతున్నారట.  ఈ చిత్రం అన్నా చెల్లెలి కి సంబంధించిన స్టోరీ అని కొన్ని కారణాల వల్ల చెల్లెలు చనిపోతుందట..కష్టాల్లో ఉన్న అన్నకు సహాయం చేస్తూ చివరకు అన్నకు అన్ని కష్టాలు తీరిపోయిన తర్వాత వదిలేసి వెళ్లిపోతుందట. అయితే ఈ స్టోరీ లైన్ నిహారికకు తెగ నచ్చడంతో సినిమాలో దెయ్యం పాత్ర వేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. అయితే అన్నయ్య పాత్రలో హర్షవర్థన్ రాణే నటించనున్నట్లు సమాచారం. ఇక దర్శకులు , సంగీత దర్శకులు సహా మిగిలిన వివరాలు త్వరలో ప్రకటించనున్నారట.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...