News and Entertainment

పనిమనిషి,యజమాని మద్య ఆసక్తికర సంభాషణ…ఖచ్చితంగా అందరిలో మార్పు తెస్తుంది



ఆమె వాళ్లింట్లో పనిమనిషి…ఉదయం వచ్చి ఇళ్ళు ఊడ్వడం దగ్గరి నుండి, బట్టలుతకడం, పాత్రలు కడగడం వరకు తానే చేస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి మరోసారి తన పనులు చేసుకొని వెళుతుంది. అయితే పండుగకు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన మాటలు …ఆ ఇంటి యజమానికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయ్..ఆ సంభాషణను మీరుకూడా వినండి మీలో కూడా అనూహ్యమైన మార్పు వస్తుంది.


  • భార్య:ఏవండీ మీ బట్టలు లాండ్రీకి తక్కువగా వేయండి.
  • భర్త:ఏం? ఏమైంది.
  • భార్య:పనిమనిషి కొన్ని రోజుల పాటు రాదు.
  • భర్త:ఎందుకని?
  • భార్య: వినాయక చవితి పండుగని తన కూతురుని, తన మనవరాలిని చూడటానికి ఊరికి వెళుతోంది.
  • భర్త :సరే.. సరే.
  • భార్య:మర్చిపోకుండా ఆమెకు పండుగ కానుకగా రూ.500 ఇవ్వండి.
  • భర్త: ఎలాగో ఉగాది  వస్తుంది కదా, ఆమెకు అప్పుడే డబ్బులు ఇవ్వొచ్చు కదా.
  • భార్య: ఆమె పనిమనిషిగా కొన్ని ఇళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. పేదమహిళ. తనకు వచ్చే కొంత ఆదాయంలో తన కూతురు, మనవరాలిని చూడటానికి వెళ్తుంది. మనం ఇచ్చే డబ్బులతో ఆమెకు కాసింత ఆసరానిస్తాయ్.
  • భర్త:అబ్బా నువ్వు మరీ సెంటిమెంట్ గా మాట్లాడకు.
  • భార్య:మీరేమి డబ్బు గురించి ఆలోచించకండి. ఓ పూట మనం టైం పాస్ కు తినే పిజ్జా తినకుండా మానేస్తే చాలు ఆ డబ్బులు కవర్ అవుతాయ్.
  • భర్త:బాగుంది నీ ఆలోచన. సరేనని ఆమెకు 500 రూపాయలు ఇచ్చారు ఆ దంపతులు.
ఆ పనిమనిషి మూడురోజుల తర్వాత తన కూతురు, మనవరాలిని చూసి మళ్ళీ పనిలోకి వచ్చింది.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...