News and Entertainment

తాజ్ మహల్ ఒకప్పటి పరమ శివుని తేజో మహాలయము?


1. ఇది తాజ్ మహల్ గా పిలవబడుతున్న ఒకప్పటి తేజో మహాలయము యొక్క విహంగవీక్షణం. గత 300 సంవత్సరాలుగా ఈ అద్భుత కట్టడము ఐదవ మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ చే తన మృత భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మితమైనట్టుగా ప్రపంచాన్ని మభ్యపెట్టడం జరుగుతోంది. ఈ చిత్రంలో కనబడుతున్న రెండు కట్టడాలు ఒకేలాగున ఉన్నా వెనక భాగములో గల కట్టడాన్ని మసీదుగా చెబుతున్నారు. తాజ్ మహల్ ఏడంతస్తుల కట్టడం. ఐదు అంతస్తులు భూమికి దిగువున ఉండి అరుదైన నిదర్శనాలు అందులోనే భూస్థాపితమయ్యాయి. 


మధ్యలో ఉన్న పాలరాయి కట్టడంకు ముందు మరియు వెనుకవైపు దాదాపు అదే రీతిలో ఉండే కట్టడాలు మరో రెండు ఉన్నాయి. ముందు భాగంలో ఉన్న కట్టడం తూర్పుముఖంగా ఉంది. వెనుక ఉన్న కట్టడం పశ్చిమముఖంగా ఉండడం చేత మసీదుగా వ్యవహరిస్తున్నారు. వెనుక కట్టడం మసీదు అయితే తాజ్ కు ముందు ఉన్న కట్టడం కూడా మసీదు ఆకారంలోనే ఉండడం ఎందుచేత? తూర్పు ముఖముగా ఉన్న కట్టడం యొక్క ఆరుబయలు ప్రాంతంలో త్రిశూలపు ఆకారంలో ఉన్న ఆకృతి ఉంది. తాజ్ గోపురపు పైభాగంలో ఉన్న కలశాఅనికి ఇది ప్రతికృతి. 2. ఈ చిత్రములో ఉన్నది ఒక దిగుడు బావి. ఇది పశ్చిమ ముఖంగా ఉన్న మసీదు పక్కలోనున్న ఒక నెలమాళిగలోనున్న అంతుస్తులలో ఉన్నది. బావిలో నీరు ఉందడానికి గుర్తుగా అడుగున తెల్లగా ప్రతిఫలిస్తున్న సూర్యుని వెలుగును చూడవచ్చు. ఇటువంటు బావులు హిందూ దేవస్థానములలో చూడవచ్చు. శత్రువులు దాడి చేసినపుడు, ఈ దిగుడు బావులను నిధులు, విగ్రహాలను దాచేందుకు వాడేవారు. మామూలు సందర్భాలలో దిగువ అంతస్తుల్లో నిధులను పేర్చిపెట్టేవారు. పై అంతస్తుల్లో ఖజానాదారులు కూర్చునేవారు. "హుండీ" అని పిలువబడే ఇప్పటి receipts ను జారీ చేసేవారు. తాజ్ మహల్ ఒక స్మారక చిహ్నమైతే అందులో ఈ దిగుడుబావి యొక్క అవసరము ఏమి?ఇంకా ఉంది...