News and Entertainment

ఆ ఊర్లో అంజనేయుడిని పూజిస్తే భయంకరమైన శిక్ష ఎందుకు?


సాధారణంగా పెద్దలకు గాని పిల్లలకు గాని భయం వేస్తే ఆంజనేయస్వామిని తలచుకోమంటారు. ఆంజనేయ విగ్రహం, ఆంజనేయ ఆలయం దుష్టశక్తుల నుంచి ఎన్నో భయంకరమైన ఆపదల నుండి ఊరిని రక్షిస్తుందని భావిస్తారు. అంతెందుకు, హను మంతుని ఆలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తికాదు. కానీ ఈ గ్రామంలో మాత్రం మీకు ఎక్కడా ఆంజనేయుడి గుడి కాదుకదా, ఆ పేరు కూడా వినబడదు. ఉత్తరాఖండ్‌లోని ద్రోణగిరి గ్రామంలో భూటియా అనే జాతి నివసిస్తుంది. వీళ్ళంతా ఆంజనేయుడిని తప్ప మిగతా దేవుళ్ళందరినీ పూజిస్తారు! ఒకవేళ గ్రామంలో ఎవరైనా ఆ స్వామి పేరు పలికినా, పూజించినా నేరంగా పరిగణిస్తారు. గ్రామం నుంచి వాళ్ళని బహిష్కరిస్తారు. ఎందుకని అడిగితే ఓ కథ చెబుతారు గ్రామస్థులు.,



త్రేతాయుగంలో రామరావణయుద్ధ సమయంలో మూర్ఛిల్లిన లక్ష్మణుని కోసం హనుమంతుడు తెచ్చిన సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. వాళ్ళు పూజించే ఈ గుట్టను హనుమంతుడు తీసుకెళ్ళేసరికి అతనిపై ఈ ఊరివాళ్ళు ద్వేషం పెంచుకున్నారు. అందుకే ఆంజనేయుడంటేనే వారికి మంట. అదీ కథ! మొత్తానికి ధైర్యానికి ప్రతీకైన హనుమానజీని ద్వేషించే గ్రామం కూడా ఉంది!


వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...