News and Entertainment

మహాభారతంలో(కురుక్షేత్ర యుద్ధం) ప్రముఖ వ్యూహాలు


కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ వ్యూహాలు
మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో
పాండవులు ఏడు అక్షౌహిణీలు, కౌరవులు
పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని
ప్రారంభించారు.

రోజుకొక వ్యూహం నిర్మించి
ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. అందులో
కొన్ని ప్రముఖమైన వ్యూహాలు..

1. క్రౌంచారుణ వ్యూహం : పాండవ సేనాని
దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో
సైన్యాన్ని నిలుపుతాడు.

2. గరుడ వ్యూహం : యుద్ధం మొదలైన
మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి ఆకారంలో
ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీనినే సువర్ణ
వ్యూహం అని కూడా అంటారు.

3. శకట వ్యూహం : మహాభారత యుద్ధ
పదకొండవ రోజున ద్రోణుడు బండి ఆకారంలో ఈ
వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని నిలిపి తాను
కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.

4. చక్ర వ్యూహం : పదమూడవ రోజు
ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దీనినే
పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో
సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం
అందరికీ సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ
వ్యూహంలో ప్రవేశించినా బయటకు రాలేక కౌరవుల
మోసానికి బలయ్యాడు.

5. మకర వ్యూహం : ఐదవ రోజున భీష్ముడు
ఈ వ్యూహాన్ని నిర్మించి మకరాకారంలో సైన్యాన్ని
నిలిపి యుద్ధరంగంలో చెలరేగిపోయి పాండవులకు
చాలా నష్టాన్ని కలిగించాడు.

6. బార్హస్పత్య వ్యూహం : పదిహేడవ రోజున
బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని
పన్నుతాడు.

7. శృంగాటక వ్యూహం: ఎనిమిదవ రోజు
భీష్ముని వ్యూహానికి ప్రతిగా
దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి
త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.

8. శ్యేన వ్యూహం: ఈ వ్యూహాన్ని కూడా
భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా
దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో
నిర్మించాడు. ఐదవరోజు నిర్మించిన ఈ
వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.

9. అర్ధచంద్ర వ్యూహం : మూడవ రోజు
భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా
దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని
నిలుపుతాడు.

10. మండల వ్యూహం : ఏడవ రోజున
భీష్ముడు మండలాకారంలో వ్యూహాన్ని రచించి
కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.

11. మండలార్ధ వ్యూహం : పన్నెండవ రోజు
ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా
ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి
పాండవ సేనను నిలుపుతాడు.


12. వజ్ర వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు
కౌరవ సేనను మండల వ్యూహంలో నిర్మించగా
ధర్మరాజు పాండవ సేనను వజ్ర వ్యూహంలో
రచిస్తాడు.

13. సూచీ ముఖ వ్యూహం : ఆరవరోజు
దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర
వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను
క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ
రెండు వ్యూహాలు భంగపడదంతో
అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని
రచించి సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

14. వ్యాల వ్యూహం : నాలుగవ రోజు
భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న
పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన
వ్యూహం. ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల
స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.

15. సర్వతోభద్ర వ్యూహం : తొమ్మిదవ రోజు
భీష్ముడు సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహంలో
నిలిపాడు.

16. మహా వ్యూహం : భీష్ముడు రెండవ రోజు
ఈ వ్యూహాన్ని నిర్మించి అజేయుడై శత్రు
సైన్యాన్ని హడలగొట్టించాడు.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...