News and Entertainment

నా చెస్ట్‌ గురించి కామెంట్స్‌ చేశారు


‘దేవదాస్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఇలియానా కొంత కాలానికే స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా ఇలియానా రికార్డుల్లోకి ఎక్కింది. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే ఈమెకు బాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చి అక్కడకు వెళ్లిపోయింది. అక్కడ కొంత కాలంగా కెరీర్‌ను సూపర్‌ పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా నడిపించింది. అయితే కొంత కాలంగా ఈమెకు టైం బాగున్నట్లుగా లేదు. ఈమె దాదాపు రెండు సంవత్సరాలు ఇబ్బందు ఎదుర్కొంది. తాజాగా ఈమెకు రెండు భారీ ఆఫర్లు దక్కాయి.

ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ సరసన ‘రుస్తుం’ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా తన గురించి పలు విమర్శలు వచ్చాయి అని, చివరకు తన చెస్ట్‌ చిన్నగా ఉంది అంటూ కూడా కొందరు కామెంట్స్‌ చేశారు. అవకాశాలు లేని సమయంలో ఏ కామెంట్స్‌ అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి. నేను కూడా అంతే అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. తన శరీర ఆకృతి గురించి, చెస్ట్‌ గురించి కామెంట్స్‌ చేసిన సమయంలో తాను ఎంతో ఏడ్చాను అని ఈమె తన ఆవేదన చెప్పుకొచ్చింది. ఎవరి గురించైనా కామెంట్స్‌ చేసే సమయంలో కాస్త వెనుక ముందు ఆలోచించాల్సిందిగా ఇలియానా చెప్పుకొచ్చింది.

loading...