News and Entertainment

గత జన్మలో ఎలా ఉన్నారు.. వచ్చే జన్మలో ఎలా ఉంటారు.. ఏడు జన్మల వెనుకున్న ఆసక్తికరమైన విశేషాలు


పునర్జన్మ ఎప్పుడూ మనకు అర్థంకాని అద్భుతమైన, ఆసక్తికరమైన విషయం. హిందూమతంతో పాటు ప్రపంచంలోని మతాలన్నీ అంగీకరించే విషయం ఏదైనా ఉందంటే అది బహుశా చనిపోయిన వారు తిరిగి జన్మించడమే. అన్ని మతాలకంటే కాసింత విప్లవిత్మకమైన బుద్దిజం కూడా పునర్జన్మను నమ్ముతుంది. మరణం తర్వాత జీవితం, పునర్జన్మ గురించి ఈజిఫ్టియన్స్ లో చాలా ధృడమైన నమ్మకం ఉంది. మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా? హిందూ పురాణాల ప్రకారం పునర్జన్మకు పెద్ద ఉదాహరణ విష్ణువు.

ఈ భూమి మీద పాపం పనిపట్టాల్సిన ప్రతిసారీ పది (దశ) అవతారాలెత్తిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది దేవతలు కూడా పునర్జన్మ పొందినట్టు మనం చాలా కథలు చూశాం. అయితే ఈ పునర్జన్మ గురించి చాలా మందిలో అపనమ్మకం కూడా ఉంది. ఇప్పటి వరకు సైంటిఫిక్ గా రుజువు లేదు కాబట్టి అది సాధ్యం కాదన్న భావం కూడా ఉంది. అయితే నమ్మేవారి కోణం నుంచి చూస్తే.. పునర్జన్మ గురించి.. కొన్ని ఆసక్తికర, ఆశ్చర్యకర, అద్భుతమైన వాస్తవాలున్నాయి.

* హిందూ మతస్తుల నమ్మకం ప్రకారం ఆత్మ నాశనం కాదు. శరీరానికే మరణం. ఆత్మ బతికే ఉంటుంది. మనం బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ కూడా శరీరాన్ని మార్చుకుంటుందట.

* కర్మను బట్టి ఆత్మ ప్రవేశం ఉంటుంది.. ఆత్మ వెళ్లే కొత్త శరీరం అనేది ఆ వ్యక్తి పూర్వ జన్మలోని కర్మను లేదా చేసిన మంచి, చెడు పనులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి మంచి పనులు చేసి, మంచి కర్మ పొంది ఉంటే.. ఆత్మ మళ్లీ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక వ్యక్తి చెడు పనులు చేసి, చెడు కర్మను పొంది ఉంటే.. అతని పునర్జన్మ దానికి ఫలితంగా అనుభవించాల్సి ఉంటుంది.

* చాలా వరకు మనుషులు పునర్జన్మ మనిషి రూపంలోనే జన్మిస్తాడు. కానీ కర్మను బట్టి కొన్నిసార్లు జంతువుగా కూడా జన్మించే అవకాశం ఉంది.

* ఆత్మ దెయ్యంగా మారుతుంది.. ఒకవేళ ఒక వ్యక్తి చాలా తీరని కోరికలతో హఠాత్తుగా చనిపోయి ఉంటే.. అతను లేదా ఆమె దయ్యం అవుతారు. తనకు అనుకూలమైన పరిస్థితులు వచ్చిన తర్వాతే పునర్జన్మ పొందుతారు.

* హిందువులు మనిషి శరీరాన్ని మాత్రమే నిర్వీర్యం చేయడం వెనక కూడా కారణం ఉంది. మరణం తర్వాత అతనికి ఈ జన్మ గురించి ఏమీ గుర్తుండకూదని దేహాన్ని కాల్చడం, లేదా పూడ్చడం ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తారు. దీనివల్ల ఆత్మ మళ్లీ ఈ మెమరీస్ కోసం వెతుక్కోకుండా మరో జన్మ పొందడానికి ఇలా చేస్తారు.

* ఇక ఏడు జన్మల విషయానికొస్తే.. ప్రతి మనిషి ఏడు సార్లు ఇలా పునర్జిన్మంచడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్లు చేసిన మంచి, చెడు పనులను బట్టి.. వాళ్ల తర్వాత జన్మ (మనిషి లేదా జంతువు) ఆధారపడి ఉంటుంది

* మరో ఆసక్తికర విషయం ఏంటంటే చనిపోయిన వెంటనే ఆత్మ మరో శరీరరంలోకి ప్రవేశించదు. కొన్నేళ్ల తర్వాత పరిస్థితుల అనుకూలంగా మారిన తర్వాత కొత్త శరీరంలోకి ప్రవేశించి పునర్జన్మ పొందుతుంది.

* ప్రతి ఒక్కరికీ గత జన్మ గురించి గుర్తు ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే పూర్వ జన్మ గురించి గుర్తు చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అంటే మన పూర్వ జన్మల గురించి మన అన్ కాన్సియస్ మైండ్ లో రికార్డ్ అయి ఉంటాయన్నమాట..

loading...