News and Entertainment

రూ.501కే స్మార్ట్ ఫోన్..!

చాంప్ వన్ కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నారా..? అసలు ఆ కంపెనీ ఉన్నట్టు కూడా తెలియదేమో. కానీ ఆ కంపెనీ 501 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అందించనుందట. బడాబడా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిస్తూ.. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ వెల్లడించిన రిగ్గింగ్ బెల్స్ కు పోటీగా... ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి తీసుకురానుందట. మిడ్ రేంజ్ మార్కెట్లో ఆఫర్ చేసే స్మార్ట్ ఫోన్ల కంటే మెరుగైన ఫీచర్లతో వినియోగదారులు ముందుకు కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చినట్టు చాంప్ వన్ వెల్లడించింది. చాంప్ వన్ సీ1 ఫోన్ ను తన సైట్ చాంప్ వన్ ఇండియా.కామ్ లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.
సెప్టెంబర్ 2 నుంచి ఫ్లాష్ అమ్మకాలు చేపడతామన్న కంపెనీ, వెబ్ సైట్ లో ముందస్తు రిజిస్ట్రేషన్ల ద్వారా ఫోన్ ను అందించనున్నట్టు తెలిపింది. అయితే సాంకేతిక సమస్యలతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు క్లోజ్ అయ్యాయని, సాంకేతిక సమస్య పరిష్కారం అనంతరం కొత్త రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. క్యాష్ ఆన్ డెలివరీలో ఈ ఫోన్ ను చాంప్ వన్ విక్రయించనుంది.
చాంప్ వన్ సీ1 ఫోన్ ఫీచర్లు...
1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
5 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే
16 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్
8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4జీ ఎల్ టీఈ, డ్యుయల్ సిమ్
ఫింగర్ ప్రింట్ స్కానర్
2500 ఎంఏహెచ్ బ్యాటరీ
ఈ ఫీచర్లన్నింటితో ప్రస్తుతం మార్కెట్లో రూ.6,999కు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
జ్ఞాన దంతం అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? తీసెస్తే జ్ఞానం పోతుందా?
కండోమ్ ఉపయోగించకుండా…ప్రెగెన్సీని రాకుండా ఉండాలంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు
అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
ఈ అమ్మాయి ఎఫ్‌బీ పోస్టు పెద్ద సంచ‌ల‌నం
చాణక్యుడు చెప్పిన హిప్నోటిజం ట్రిక్స్
loading...