News and Entertainment

కాకి తల మీద వాలితే మరణం. ఇది ఒక మూడ నమ్మకమా ? లేక మనకు తెలియని సైన్సా ?

కాకి తల మీద పడితే మరణమని, లేదా తల స్నానం చేయాలని మన పెద్ద వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు న్న వారు ఇది చెప్తే ఇంకా మూఢ నమ్మకాలు నమ్ముతున్నారని అని చెప్పి నవ్వుతారు. కాని దీని వెనుక సైన్స్ దాగి వుంది. అవును మన పూర్వీకులు, పెద్ద వాళ్ళు చేసే తప్పేంటో తెలూసా. పిల్లలకు అలా చేసినప్పుడు ఎందుకు అలా చేస్తున్నారో చెప్పారు. ఉదాహారణకు మనం గుమ్మాలకు పసుపు రాస్తాం.ఎందుకు అని అడిగితే చెప్పరు. అందుకే దానిని ఒక మూఢ నమ్మకం అని చెప్పి వదిలేస్తారు ఇప్పుడు వున్న కుర్రవాళ్ళు .అదే పసుపు క్రిమి సంహారిణి.అది రాయడం వల్ల బయట నుంచి వచ్చే క్రిములు నాశనమవుతాయి అని చెప్తే ఎందుకు నమ్మారు. సేమ్ టు సేమ్ అలాగే కాకి తల మీద పడితే స్నానం చేయాలి.
ఎందుకంటే కాకి కుళ్ళిన ఆహారాన్ని తింటుంది. అలా తిన్నప్పుడు తన కాలికి, వంటికి, ముక్కుకి ఆ క్రిములు అంటుకుంటాయి. సో అది మనల్ని గిరినప్పుడు , పోడిచినప్పుడు, వాలినప్పుడు ఆ క్రిములు ఎక్కడ మనకు అంటుకోని వుండిపోతాయేమోనని పెద్దలు తలస్నానం చేయమంటారు. ఇది పిల్లలు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం పెద్దలదే. ఇక మరణం విషయానికి వస్తే ఇది జ్యోతిష్యులు కూడా ఈ విషయాన్ని కొట్టిపారేసారు. కాని మన పూర్వీకులు కాకి రూపంలో మనకు కలుసుకోవచ్చాని అందుకే పిండ ప్రధానం చేసినప్పుడు కాకి కి పెట్టేలా చేస్తారని .. సో కాకి మనల్ని తాకినప్పుడు ఒక సారి గుడికి వెళ్ళి 108 ప్రదక్షణలు చేస్తే చాలు అని చెప్తున్నారు జ్యోతిష్యులు.

loading...