News and Entertainment

మనిషి ఆకారంలో ఉన్న పండ్లను చూశారా?


స్వతహాగా మనకు కాయలు లేదా పండ్లు అనగానే గుర్తుకు వచ్చే షేప్‌ వృతం లేదా చతురస్రం. ప్రపంచంలో వందలో 99 శాతం పండ్లు లేదా కాయలు ఈ రెండు ఆకారాల్లోనే ఉంటాయి. కొన్ని కొన్ని మాత్రమే వైవిధ్యభరిత ఆకారంలో ఉంటాయి. అయితే ఒక్క బియర్‌ గ్రీన్‌ ఫ్రూట్‌ మాత్రమే మనిషి ఆకారంలో ఉంటాయి. ఏదో మనిషిలా అనిపించడం కాకుండా, అచ్చు దిశ మొలతో ఉన్న ఒక అందమైన అమ్మాయి ఆకారంలో ఈ పండ్లు ఉంటాయి. ఇలాంటి పండ్లు కేవలం థాయిలాండ్‌లో మాత్రమే కనిపిస్తాయి. ప్రపంచంలో మరెక్కడ కూడా ఇలాంటి ఫలాలు, ఇలాంటి ఆకారంలో పండ్లు లభించవు, కనిపించవు. 




ఈ పండ్లు ఇలాంటి ఆకారంలో ఉండటానికి కారణంగా బౌద్ద పురాణంలో రాసి ఉన్నట్లుగా అక్కడి స్థానికులు చెబుతారు. బౌద్ద దేవుడు అయిన ఇంద్ర మరియు ఆయన భార్య వెస్సంతర అడవిలో జీవణం గడుపుతూ ఉంటారు. ఒకానొక రోజు వెస్సంతర ఆహారం తీసుకు వచ్చేందుకు అడవికి వెళ్లింది. ఆ సమయంలోనే ఆమెపై వ్యామోహంతో కొందరు ఆమె వెంట బడ్డారు. వారి దృష్టిని మరల్చేందుకు ఇంద్ర అచ్చు వెస్సంతర రూపంలో ఉన్న ఫలంను తయారు చేశాడు. ఆ ఫలాలను చూసిన వారు వెస్సంతరను వదిలేసి వాటిని తిన్నారు. అలా అమ్మాయి ఆకారం గ ఈ ఫలాలు వచ్చాయి అని అక్కడి వారు చెబుతూ ఉన్నారు. అయితే వీటిని తింటే ఏం అవుతుందో అనే భయంతో ఇప్పటి వరకు ఎవరు కూడా వీటిని తినే సాహసం చేయలేదు. 

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...