News and Entertainment

దే.వు.డా..! అది తిన్నాక ముద్దుపెట్టాడు, ప్రియురాలు చనిపోయింది..!

ముద్దు.. ప్రేమికుల జీవితంలో మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. మధురానుభూతులను మిగులుస్తుంది. కానీ ఇంగ్లండ్ కు చెందిన ఆ ప్రేమ జంటకు మాత్రం విషాదాన్ని మిగిల్చింది. కేవలం బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన కిస్ కారణంగా యువతి ప్రాణాలు కోల్పోయింది.
ఇంగ్లండ్ కు చెందిన మరియమ్ లిమే (20) తన బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు హోటల్ కు వెళ్ళింది. అక్కడ చాలా సేపు అతనితో మాట్లాడుతూ సమయం గడిపింది. చివరికి పోతూ పోతూ.. మరియమ్ లిమేకు బాయ్ ఫ్రెండ్ తియ్యని ముద్దు పెట్టాడు. ఆ కిస్ తన కొంపముంచుతుందని ప్రియురాలు ఊహించలేకపోయింది. ఆ తియ్యని ముద్దే ప్రేయసి మరణానికి దారితీసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బాయ్ ఫ్రెండ్ ముద్దు పెట్టాక మరియమ్ ఇంటికొచ్చింది. కానీ ఆమెకు నిద్రమాత్రం పట్టలేదు. పైగా శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. డాక్టర్లకు కాల్ చేసి వారు వచ్చే లోపు.. ఆమె చనిపోయింది.

పోస్ట్ మార్టమ్ నివేదికలో వైద్యులు మరియమ్ లిమే మరణానికి కారణాలను వెలికితీశారు. బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ముద్దుతో ఆమె మెదడుకు ఆక్సిజన్ అందలేదని వైద్యులు నిర్ధారించారు. హోటల్ కు వచ్చే ముందు ఆ బాయ్ ఫ్రెండ్ పీనట్ బటర్ స్కాచ్ శాండ్ విచ్ తిన్నాడట. అయితే మరియమ్ లిమేకు పీనట్ అంటే అలెర్జీ.. కొంచెం తిన్నా అది ఆమె ప్రాణానికి హాని కలిగిస్తుంది. దానికి తోడు ఆస్తమాతో బాధపడుతోంది. ఈ కారణంతోనే ముద్దు ద్వారా అలెర్జీ కలిగించే ఆహారం మెదడుకు ఆక్సిజన్ అందకుండా చేసిందని, మరియమ్ లిమే చనిపోవడానికి కారణమైందని వైద్యులు స్పష్టం చేశారు. మొత్తంగా పీ నట్ అల్జెరీ ఆ ప్రేమికుల జీవితాల్లో విషాదాన్ని నింపింది.



వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...