News and Entertainment

చనిపోతూ తండ్రి కొడుక్కి రాసిన లేఖ..! గుండె బరువెక్కిస్తోంది..!


ఇప్పటి వరకు మనం చాలా ఉత్తరాలు చదువుంటాం. కానీ ఈ లేఖ చూస్తే .. ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే. ! హృదయాన్ని బరువెక్కించే ఈ లేఖ .. ప్రముఖ గీత రచయిత ముత్తుకుమార్ రాసింది. తమిళ రచయిత ముత్తుకుమార్ ..ఇటీవల కామెర్ల వ్యాధితో బాధపడుతూ కన్ను మూశాడు. చనిపోయే ముందు తన తొమ్మిదేళ్ల కుమారుడికి ఓ లేఖ రాశాడు. పెద్దయ్యాక చదువుకోవాలని చూచించాడు. ఇప్పుడు ఆ లేఖ కన్నీళ్లు పెట్టిస్తోంది. చదవిన వారి గుండె బరువెక్కిస్తోంది.



‘‘ప్రియమైన కుమారుడికి నాన్న రాస్తున్నది.. ఇది నేను రాసే తొలి లేఖ. దీన్ని చదివి అర్థం చేసుకునే వయసులో నీవు లేవు. భాష వేళ్లు పట్టుకుని.. నడుస్తున్నావ్‌. నా దగ్గర నుంచి మా నాన్న దాచిన రహస్యాల పెట్టె తాళాన్ని నేను వెతికినట్టే.. నువ్వూ వెతుకుతావు. కానీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. ఎక్కువగా ప్రయాణాలు చెయ్‌. ఆ ప్రయాణాలే నీకు విలువైన అనుభవాన్నిస్తాయి. పుస్తకాలను ప్రేమించు. ఒక్కో పుస్తకం.. ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. మీ తాత, నాన్న పుస్తకాల ప్రపంచంలోనే కనుమరుగయ్యారు. నీ రక్తంలోనూ ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది. దక్కిన పని కన్నా.. నచ్చిన పని చెయ్‌. ఆనందమైన జీవితాన్ని కొనసాగించు.

loading...