News and Entertainment

ఈ అమ్మాయి ఎఫ్‌బీ పోస్టు పెద్ద సంచ‌ల‌నం


14 సెకన్ల పాటు కన్నార్పకుండా మహిళను చూసిన పురుషుల మీద కేసు పెట్టొచ్చని కేరళ ఎక్సైజ్‌ కమిషనర్‌ రిషిరాజ్‌ సింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ కామెంట్‌పై స్పందించిన ఓ కేర‌ళ అమ్మాయి త‌న ఫేస్‌బుక్‌లో రిషిరాజ్‌కు ఘాటైన రిప్లే ఇచ్చింది. ఆ పోస్టుకు చాలా అస‌భ్య‌క‌రంగా రిప్లేలు వ‌చ్చినా ఆమె కుంగిపోకుండా అంత‌కంటే బ‌ల‌మైన రిప్లేతో వారి నోళ్లు మూయించింది. ఇప్పుడు ఆమె పోస్ట్‌ ఫేస్‌బుక్‌లో సంచలనం సృష్టిస్తోంది.

వనజ వాసుదేవ్‌. కేరళలోని అలప్పుజ నివాసి. ఆగస్టు 16న రిషిరాజ్‌ సింగ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ఆమె స్పందిస్తూ 14 సెకన్లపాటు పురుషుడు ఒక స్త్రీ‌ని చూసినంత మాత్రాన అతని మీద కేసు ఫైల్‌ చేయటం అసమంజసమ‌ని చెప్పింది. దీనిపై ఆమె స్పందిస్తూ ప‌బ్లిక్ ప్లేస్‌లో త‌న‌ను మ‌గ‌వాళ్లు చూడ‌డాన్ని ఎంజాయ్ చేస్తాన‌ని… అయితే వారు ఎంత సేపు చూడాల‌నే దానికి స‌రైన కొల‌మానం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించింది. ఆమె పోస్టుకు చాలా మంది పురుషుల నుంచే ఘాటైన రిప్లేలు వ‌చ్చాయి.

కొంతమందైతే ఆమెను వ్యభిచారుల కోవలోకి తోసేశారు. ఇంకొంతమంది మరింత దిగజారి కోరిక తీర్చటానికి ఆమె రేట్‌ ఎంతో ప్రైవేట్‌ మెసేజ్‌లలో అడిగేశారు. అయితే ఇంతమందికి పర్సనల్‌గా రిప్లై ఇవ్వటం అనవసరం అని భావించిన వనజ రెండో పోస్ట్‌ పెట్టేసింది. ఈ పోస్టే ఇప్పుడు ఫేస్‌బుక్‌లో ట్రెండ్‌ అవుతోంది.


వ‌న‌జ సెకండ్ పోస్ట్ ఇదే:
ఓ విధ‌వ సంతానంగా పెరిగే క్ర‌మంలో తాను ఎన్ని క‌ష్టాలు అనుభ‌వించానో చెప్పిన వ‌న‌జ త‌మ తండ్రి చ‌నిపోవ‌డంతో త‌మ‌ను పెంచే శక్తి లేక తల్లి ఎంతో వ్యథకు లోనయ్యేదట. ఆ బాధతో, చిరాకుతో పిల్లలను బెల్ట్‌తో చేతికొద్దీ కొట్టేదట. పిల్లలు నిద్రపోయిన తర్వాత పశ్చాత్తాపంతో కుమిలిపోతూ కొట్టడానికి వాడిన బెల్టును తాకి వెక్కి వెక్కి ఏడ్చేదట. అలాంటి వాతావరణంలో పెరిగి పెద్దయిన వనజ చదువు ముగించి చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఆ క్రమంలో తనలో గూడు కట్టుకున్న మనుషుల పట్ల ఉన్న ఏహ్యభావాన్ని వదిలించుకుంది. ఆ స్థానంలో ప్రేమను నింపుకుంది. తన భారతీయ తుమ్ముళ్లనుద్దేశించి ‘నా మర్మాయవాల గురించి మాట్లాడే తమ్ముళ్లూ… నాకు సంస్కారం నేర్పించే అర్హత మీకు లేదు’ అంటూ నేరుగా కాకపోయినా ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో చెంప పగులగొట్టేసింది. అంతేకాదు తన గౌరవానికి వెలకట్టాలనుకున్నవాళ్లకి ఎన్ని గుండెలు? అని కూడా నిలదీసింది. ఇప్పుడిదే పోస్ట్‌ కేరళలో సంచలనమైంది. కోజికోడ్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత నాయర్‌, కేరళ ఫిల్మ్‌ మేకర్‌ ఆషిక్‌ అబుతోపాటు ఇంకొంతమంది ప్రముఖులు వనజ పోస్ట్‌ను షేర్‌ చేసేశారు.

loading...