News and Entertainment

పుష్కరం 12 రోజులు..ఏ రోజు ఏ పని చేస్తే మంచిది ?

పుష్కర యాత్రికులు నదిలో స్నానం చేశాక దాన ధర్మాలు విధిగా చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అహంకారం, మమకారం వల్ల ఆర్జించిన దానిని ఉపకార భావంతో, సహకార సేవా దృక్పథంతో త్యజించడమే దానం. దాతను, గ్రహీతను కూడా పుష్కర దానం ధన్యులను చేస్తుంది. ధన వ్యామోహం, వస్తు వాహన వ్యామోహం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఆర్జించింది త్యజించడంలో నిస్వార్థం, నిర్మోహత్వం, నిరాడంబరత్వం అలవడుతాయి. దుష్ట సంపాదనం, దుష్టజీవనం నుంచి దానం మానవులను దూరం చేస్తుంది. శాస్త్రం నిర్దేశించిన పుష్కర కల్పం విధించిన దాన విధులు కృష్ణా పుష్కర యాత్రికులు నిర్వహించడం శ్రేయస్కరం. ఈ దాన విధులు పుష్కరం జరిగే పన్నెండు రోజుల పాటు అవశ్యం పాటించాలి.

12 రోజుల్లో ఏ ఏ రోజున ఏ ఏ దానం చేయాలి, వాటి ప్రాశస్త్యం ఏమిటంటే…?

మొదటి రోజు: బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేయాలి.
ఫలితం: బంగారం, వెండి దానం చేయడం వల్ల ఇహలోక సుఖభోగాలతో పాటు సూర్యచంద్ర లోకాల ప్రాప్తి కలుగుతుంది. భూదానం వల్ల భూపతిత్వం వస్తుంది. ధాన్య దానం వల్ల కుబేర సంపద కలిగిస్తుంది.
రెండో రోజు: గోవు, వస్త్రం, రత్నం, లవణ దానాలు చేయాలి.
ఫలితం: గోవు దానం చేయడం వల్ల రుద్రలోక ప్రాప్తి, వస్త్ర దానం వల్ల వసులోక ప్రాప్తి, రత్న దానం వల్ల సార్వభౌమత్వం, లవణ దానం వల్ల శరీర ఆరోగ్యం కలుగుతాయి.
మూడో రోజు: శాఖ, ఫల, గుడాలు (గుగ్గిళ్లు), అశ్వదానాలు చేయాలి.
ఫలితం: కుబేర, అశ్వనీ దేవతాలోక సౌఖ్యాలు అనుభవించి, ఇంద్రసమాన వైభవం పొందుతారు.
loading...