News and Entertainment

Facebookలో లాగిన్ అయి ఉండగా సెక్స్ వీడియోస్ చూశారో మీ బండారం మొత్తం ఫేసుబుక్ బయటపెడుతోంది…జాగ్రత్త

అనిల్ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు..
ఓ పక్క ఆఫీస్ పని చేసుకుంటూనే ఓ టాబ్‌లో Facebook మరో టాబ్‌లో ఓ బూతు సైట్ ఓపెన్ చేసి చాటుగా చూసేస్తున్నాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ” హమ్మయ్య ” అనుకుని కాస్తంత రిలాక్స్‌డ్‌గానే ఎంజాయ్ చేస్తున్నాడు.
అతనికి తెలీదు అతని భాగోతం మొత్తం తెలీకుండానే Facebook news feedలో పోస్ట్ అయిందని! మరుసటి రోజు నుండి అతని కొలీగ్స్ చులకనగా చూడడం మొదలుపెట్టారు.
వినడానికే భయంగా ఉంది కదూ? ఇది నిజం. కొన్ని వందలసార్లు ఇలాంటివి news feed ద్వారా నా దృష్టికి వచ్చాయి. నాకున్న 5000 మంది ఫ్రెండ్స్‌లో ఎవరో ఏదో అశ్లీల సైట్‌లోకి వెళ్లి గడిపేస్తుంటారు. వాళ్లకు తెలీకుండానే వాళ్లేం చూస్తున్నారో Facebookలో పోస్ట్ అవుతుంటాయి.
Dailymotion లాంటి వీడియో స్ట్రీమింగ్ సైట్లలో కూడా hot aunty అనీ, ఇంకా అనేక పెద్దల వీడియోల టైటిల్స్‌తో వాళ్లు చూస్తున్నవన్నీ నాకు కన్పించేవి.
ఎందుకిలా జరుగుతుంది?
Facebook కేవలం ఓ వెబ్ సైట్‌కో, మొబైల్ యాప్‌కో పరిమితం అవలేదు. దాని పరిధిని విస్తరించుకోవాలనుకుంది. అందుకే Developer APIనీ, Facebook plugins నీ వెబ్‌సైట్ ఓనర్లకి తయారు చేసి అందిస్తోంది. వీటివల్ల ఇద్దరికీ లాభమే, ఎలాగంటే!

సైట్ ఓనర్‌కి ఇలా లాభం:
తమ సైట్లకి వచ్చిన వారు నేరుగా Facebook ఐడెంటిటీతోనే కామెంట్లు రాసేలా సెట్ చేయొచ్చు. తమ పేజీల్ని ఆయా విజిటర్స్ Facebookలో నేరుగా షేర్ చేసుకునేలా బటన్లు లభిస్తాయి. ఒకవేళ ఆయా పేజీల్ని ఎవరైనా Facebook యూజర్లు like చేస్తే ” ఫలానా శ్రీధర్ ఫలానా పేజీని like చేశాడని ” అతని Facebook ఫ్రెండ్స్ అందరికీ ఠాంఠాం వెయ్యబడుతుంది.
ఇలా దారుణమైన సందర్భాల్లో ఒక విజిటర్‌గా మీరు షేర్ చెయ్యకపోయినా.. ఫలానా అశ్లీలమైన పేజీని మీరు చూశారని మీ తరఫున మీ ఫ్రెండ్స్ news feedలో కన్పిస్తుంది.
Facebookకి ఇలా లాభం:
Facebook మనకు యాడ్లు చూపించడం ద్వారా డబ్బులు సంపాదిస్తుంది. మనం ఎలాంటి అంశాలు ఇష్టపడుతున్నామో దానికి అర్థమైతే మనం ఏ బలహీనతలకి లొంగుతామో అలాంటి యాడ్లు అది చూపిస్తుంది.
ఉదా:- మీరు సెక్స్ websites చూస్తున్నారనుకోండి. Facebook ఆయా సైట్ల ఓనర్లకి అందించిన Plugins ద్వారా మీరేం చూస్తున్నారో డేటాని తాను సేకరించి.. ” ఓకే ఫలానా వ్యక్తికి adult chat వంటి యాడ్లు చూపిస్తే టెమ్ట్ అవుతాడు ” అని భావించి అలాంటి యాడ్లు చూపిస్తుంది.
కొన్నేళ్ల క్రితం థర్ట్ పార్టీ సైట్లలో Like, Share బటన్లను క్లిక్ చేసి చూసే వాటిని తాను ఏమాత్రం ఇకపై ట్రాక్ చెయ్యమని ఫేస్‌బుక్ కబుర్లు చెప్పింది. కానీ సైలెంట్‌గా ఆ పని చేస్తూనే ఉంది.
సో అర్థమైంది కదా.. Facebookలో లాగిన్ అయి ఉండగా అశ్లీల సైట్లు చూశారో.. మీ పని గల్లంతే!!


వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...