News and Entertainment

బరితెగించిన ప్రముఖ సింగర్...పబ్లిక్ లో శృంగారం

పదమూడేళ్ల వయసులోనే పాప్ సింగర్‌గా ప్రపంచానికి పరిచయమై, సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన జెస్టిన్ బీబర్ రోజుకో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు. సరదా లైఫ్‌కు అలవాటుపడిన బీబర్ ఈ సంఘటనతో అభిమానులందరి చేత చీ కొట్టించుకుంటున్నాడు. పట్టపగలు పబ్లిక్‌లో తన తాజా గర్ల్‌ఫ్రెండ్ సోఫియా రిచీతో శృంగారం చేస్తున్న ఫోటోలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒంటిమీద నూలుపోగు లేకుండా ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులివ్వడంపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె పుట్టినరోజు సందర్భంగా తనతో గడిపిన ఫోటోలే ఇవని తేలింది.
అయితే బీబర్‌కు ఇదేం కొత్త కాదు. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌, పాప్‌స్టార్‌ సెలెనాతో డేటింగ్ చేస్తుండగా గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాన్ డ్రైవర్‌ను కొట్టినందుకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత బ్రెజిల్‌లోని ఓ వేశ్యగృహంలో బీబర్‌ దొరికిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బీబర్ పర్సనల్ లైఫ్‌లో ఇలాంటి వివాదాలు ఎన్నో. పాప్ సింగర్‌గా ఎంత ఫేమస్ అయ్యాడో.. వివాదాలతో కూడా అదే స్థాయిలో ఫోకస్ అయ్యాడు.