News and Entertainment

వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి పాద‌ముద్ర‌లు ప‌డింది ఇక్క‌డే..! ఆయ‌న విడిది చేసిన ప్రాంతం కూడా ఇదే..!


పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి గురించి తెలుసు క‌దా..! 17వ శ‌తాబ్దంలో జ‌న్మించి క‌డ‌ప జిల్లాలోని కంది మ‌ల్లాయప‌ల్లి గ్రామంలో ఉన్న అచ్చ‌మాంబ ఇంట్లో గోపాల‌కుడిగా ప‌నిచేస్తూ స‌మీపంలో ఉన్న ర‌వ్వ‌ల కొండ‌పై కాల‌జ్ఞాన ర‌చ‌న చేశారు. భ‌విష్య‌త్తులో మ‌నుషులు ఎలా ఉంటారో, ఎలాంటి ప‌రిణామాలు, న‌ష్టాలు సంభ‌విస్తాయో, ప్ర‌పంచం ఎప్పుడు అంత‌మ‌వుతుంది, ఎలా ఉంటుంది… తదిత‌ర విష‌యాల‌ను కాల‌జ్ఞానంలో రాశారు. అనంత‌రం చివ‌రి ద‌శ‌లో స‌మాధిలోకి వెళ్లారు. అయితే బ్రహ్మంగారు ర‌చించిన కాల‌జ్ఞాన తాళ‌ప‌త్రాలు ఇప్ప‌టికీ భ‌ద్రంగానే ఉన్నాయి. ఆయ‌న నివాసం ఉన్న కంది మ‌ల్లాయ‌ప‌ల్లి గ్రామం బ్రహ్మంగారి మఠంగా పేరుగాంచింది. అక్క‌డికి ఏటా అధిక సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసి స్వామి వారి మ‌ఠాన్ని, స‌మాధిని ద‌ర్శించుకుంటారు. అయితే మీకో విషయం తెలుసా..? ఆయ‌న పాద‌ముద్ర‌లు కూడా కంది మ‌ల్లాయ‌ప‌ల్లిలోని ఓ కొండ‌పై ఉన్నాయ‌ట‌. ఆ విష‌యం స్థానికుల‌కు త‌ప్ప ఇత‌రుల‌కు తెలియ‌ద‌ట‌.




కంది మ‌ల్లాయ‌ప‌ల్లి గ్రామంలో ఉన్న‌ప్పుడు బ్ర‌హ్మం గారు స‌మీప గ్రామాల‌కు త‌న పంచ క‌ళ్యాణి గుర్రంపై వెళ్లి వ‌చ్చేవార‌ట‌. అలా ఆయా గ్రామాల‌కు వెళ్తూ ఉండ‌గా ఒక రోజు కంది మ‌ల్లాయ‌ప‌ల్లి గ్రామానికి స‌మీపంలో ఉన్న గుట్ట‌పై ఆయ‌న గుర్రం అక‌స్మాత్తుగా ఆగిపోయింద‌ట‌. దాంతో స్వామి వారు గుర్రం దిగార‌ట‌. ఆ క్ర‌మంలో ఆయ‌న త‌న పాదం భూమిపై మోపిన‌ప్పుడు అక్క‌డి బండ రాళ్ల‌పై ఆయ‌న పాద‌ముద్ర‌లు ప‌డ్డాయ‌ట‌. దీంతోపాటు గుర్రం కాలి ముద్ర‌లు కూడా ప‌డ్డాయ‌ట‌. అయితే అక్క‌డ కొంత సేపు విశ్రాంతి తీసుకోవ‌డం కోసం బండ‌రాళ్ల‌పై విడిది లాంటి ప్ర‌దేశాన్ని బ్ర‌హ్మం గారి శిష్యులు ఏర్పాటు చేశార‌ట‌. ఆ విడిది కూడా ఇప్ప‌టికీ స్ప‌ష్టంగా కనిపిస్తుంద‌ని స్థానికులు చెబుతున్నారు.
బ్ర‌హ్మం గారి పాద ముద్ర‌లు, ఆయన విడిది చేసిన ప్రాంతానికి సంబంధించిన రాళ్ల‌ను కింది వీడియోలో స్ప‌ష్టంగా మీరు కూడా చూడ‌వ‌చ్చు..!

loading...