News and Entertainment

శృంగారం ద్వారా ప్రమాదకరమైన ఈ మూడు అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి.. జాగ్రత్త


ఈరోజుల్లో శృంగారానికి పరిమితులు లేకుండా పోయాయి. మితిమీరిన శృంగారం వల్ల లేనిపోని వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు.

మనుషుల మధ్య విచ్చలవిడి శృంగారం ద్వారా మూడు సాధారణ అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన పునశ్చరణ నివేదికలో హెచ్చరించింది. ప్రతి సంవత్సరం 20కోట్ల మంది పైగా గనేరియా, సిఫిలిస్, క్లమిడియా లాంటి శృంగార సంబంధిత వ్యాధుల బారిన పడి జీవితాలను కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధులను..

అరికట్టడానికి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మందులు వాడినా అవి పెద్దగా వాటిపై ప్రభావం చూపలేకపోవడం వల్ల వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది.
ఈ అంటు వ్యాధులు ప్రబలిన వెంటనే వైద్యులను కలిసి సరైన మందుల డోస్ ను వాడాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. గనేరియా వ్యాధి గొంతువరకు విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ఆఫీసర్ టియోడోరా చెప్పారు. క్లమిడియా వ్యాధి ఉన్న రోగులు మూత్రం పోసేటపుడు విపరీతమైన మంట ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సిఫిలీస్ వ్యాధి తల్లి నుంచి శిశువులకు వ్యాపించడం వల్ల గర్భస్త మరణాలు సంభవించే ప్రమాదముందని డాక్టర్ టియోడోరా వివరించారు.

loading...