News and Entertainment

పవన్ కళ్యాణ్ కాళ్ళు విరగ్గొడతానన్న జయలలిత...!


తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతి లో ఏర్పాటు చేసిన సభలో ఆవేశంగా ప్రసంగించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి ఆయన ప్రస్తావించారు. గతంలో ప్రత్యేక హోదా పై సినీ నటుడు శివాజీ నిరాహార దీక్ష కూడా చేసిన విష్యం ప్రేక్షకులకు విదితమే. వామపక్షాలు, వైకాపా ఈ విషయమై నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాయి. తాజా సభలో పవన్ కళ్యాణ్ మిత్ర పక్షాలైన తెలుగుదేశం బిజెపి పార్టీల నేతలను సున్నితంగా విమర్శించారు. తెలుగుదేశం ఎంపి లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా గురించి అడుక్కుంటున్నారని, డిమాండ్ చేయడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ నేపధ్యంలో ఆయన కొంతమంది ఎంపి ల పేర్లను కూడా ప్రస్తావించారు. దీనిపై తెలుగు దేశం ఎంపి లు కూడా కౌంటర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ తనదైన శైలి లో పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ప్రతి విమర్శలు చేసారు.
ఒక అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కుంభ కర్ణుడిలా నిద్రపోయాడని ఆయన ద్వజమెత్తారు. ఇప్పుడు లేచి ప్రత్యేక హోదా కోసం ఎంపిలు రాజీనామా చేయాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏది పడితే అది మాటాడుతున్నారని, ఆయన ప్రవర్తన మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరికలు జారీ చేసారు. తాము కూడా ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తున్నామని, అసలు ప్రత్యేక హోదా అంశం లేవనేట్టిందే తానూ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇదే వ్యాఖ్యలు తమిళనాడులో చేస్తే అక్కడి ముఖ్యమంత్రి జయలలిత కాళ్ళు చేతులు విరగ్గొట్టి లోపల వేయించేవారని అన్నారు. హోదా కోసం ఏమైనా చేసేందుకు తాము సిద్దమని, పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం ఏం చేసారని ప్రశ్నించారు. చివరగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే జనసేన కు పడుతుందని తీవ్ర పదజాలంతో విమర్శించారు. పవన్ కళ్యాణ్ పై టి జి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

loading...