News and Entertainment

వ్యాసుడు భాగవతంలో చెప్పిన విషయాలు యాజిటీజ్ ఎలా జరుగుతున్నాయో తెలుసా?

ఏమైనా విపరీత సంఘటనలు, దారుణాలు జరిగినప్పుడు ‘కలికాలం’ అనడం తరచూ వినిపిస్తుంటంది. కలి యుగంలో పాపం పెరిగిపోయి దారుణాలు జరుగుతాయి హిందువుల నమ్మకం. దానికితోడు ఆశ్చర్యపోయే సంఘటనలు జరిగినప్పుడు ‘బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని’ అనుకోవడం తెలుగు వాళ్లకు కామన్.

నిజంగానే కలి యుగం గురించి ఇతిహాసాల్లో చెప్పింది వాస్తవమేనా? కొన్ని కొన్ని చదివితే అవును అనక తప్పని పరిస్థితి. హిందువుల ప్రముఖ గ్రంథాల్లో ఒకటైన ‘శ్రీమత్ భాగవతం’లో కలియుగం గురించి చెప్పిన విషయు వింటే మైండ్ బ్లాంక్ అవుతుంది. వ్యాసుడు కలియుగం గురించి అంత కచ్చితంగా ఎలా ఊహించగలిగాడని ఆశ్చర్యం వేస్తుంది.

హిందువుల నమ్మకం ప్రకారం భాగవతం రాసి వేల ఏళ్లు దాటిపోయింది. నమ్మకపోయినా, ఆధునిక చరిత్రకారుల లెక్కను మాత్రమే తీసుకున్నా 1500 సంవత్సరాలు దాటేసింది. భాగవతం 6వ శతాబ్దంలో రాసి ఉంటారని వాళ్ళ అంచనా. భాగవతంలోని 12 అశ్వాసంలో కలి యుగం గురించి ఉన్న ఫ్యాక్ట్స్ మీరే చూడండి!

ప్రభుత్వం

1. పాలకులు క్రూరులుగా ఉంటారు. దొంగల కంటే హీనంగా బిహేవ్ చేస్తారు. జనాలు అడవుల పట్టి పోతారు.
2. చట్టం, న్యాయం అనేవి వ్యక్తుల అధికారం, శక్తి ఆధారంగా పనిచేస్తాయి.
3. జనాభా పెరిగిపోతుంది. పాపులు పెరిగిపోతారు. సంప్రదాయంగా వస్తున్న కులంతో సంబంధం లేకుండా ఎవరు బలాన్ని చాటుకుంటే వారే రాజు అవుతారు.
4. దొంగలే రాజులు అవుతారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం, అవసరం లేని హింస.. ఇవే మనిషి వృత్తిగా మారిపోతాయి.
5. కరువు, అధిక పన్నుల వల్ల జనాల ఆకులు, అలమలు తిని బతకాల్సిన పరిస్థితి వస్తుంది.

సమాజం

6. మతం, నిజాయితీ, సహనం, జాలి, జీవిత కాలం, శుభ్రత, శారీరక బలం, జ్ఞాపక శక్తి రోజు రోజుకూ తగ్గిపోతాయి.
7. ఉత్తమ గుణాలు, మంచి నడవడిక, మంచి జన్మ అనేవి వ్యక్తుల సంపద ఆధారంగా నిర్ణయించబడతాయి.
8. కపటం, వంచనలతో లాభం, ఫలితం పొందుతారు. పైపై ఆకర్షణలతో ఆడ-మగ కలసి నివసిస్తారు.
9. మాటలతో గారడీ చేసే వాడినే పండితుడు అనుకుంటారు. డబ్బులేని వాడిని చిన్న చూపు చూస్తారు. హిపోక్రసీ (కపటం) రాజ్యమేలుతుంది.
10. పొట్ట నింపుకోవడమే జీవిత లక్ష్యం అయిపోతుంది.
11. కేవలం, నోటి మాట ఆధారంగా పెళ్లిళ్లు నిశ్చమైపోతాయి. హెయిర్ స్టైల్ ఆధారంగా అందాన్ని నిర్ణయిస్తారు.

శరీరం-ఆరోగ్యం

12. మనుషుల ఆయుష్షు 50 ఏళ్ళకు పడిపోతుంది. అన్ని జీవుల పరిమాణాలూ తగ్గిపోతాయి.
13. చలి, వేడి, గాలి, వాన, మంచు.. ఇలాంటి వాటికే జనాలకు జబ్బులు వచ్చేస్తాయి. దానికితోడు గొడవలు, ఆకలి, దాహం, వ్యాధులు, ఆందోళన జనాల్ని వేధిస్తాయి.
14. చెట్లు మరగుజ్జుల్లా అవుతాయి. మనుషులు గాడిదల్లా తయారవుతారు.

ఆధ్యాత్మిత – మతం

15. జనాల్లో పేరు కోసమే మత నియమాలు పాటిస్తారు. మతం తెలిసేలా ఉన్న వేషధారణ ఆధారంగా ఎవరిది ఏ సంప్రదాయమో గుర్తిస్తారు.
16. మత నియమాలు వ్యర్థాలు అయిపోతాయి. వేదాలు చూపిన బాటను సమాజం మర్చిపోతుంది. నాస్తికత్వం పెరుగుతుంది.
17. కేవలం జంధ్యం వేసుకున్నంత మాత్రం చేతనే బ్రాహ్మణుడైపోతాడు.
18. ఆధ్యాత్మిక ఆశ్రమాలు లౌకిక వ్యవహారాల్లో మునిగిపోతాయి.

కల్కి దేవుడు

19. కలియుగంలో పాపాలు పెరిగిపోయినప్పడు, ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు వస్తాడు. భౌతికమైన వస్తువులు, పనుల నుంచి భక్తులను విడిపించడానికి శ్రీ మహా విష్ణువు అవతరిస్తాడు.
20. శంభల అనే ఊరిలో ఉత్తమ బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి పుడతాడు.
21. దేవదత్త అనే గుర్రంపై, తన 8 ప్రత్యేకతలను ప్రదర్శిస్తూ, గొప్ప తేజస్సుతో, మహా వేగంతో వస్తూ దొంగలుగా ఉన్న పాలకులను చంపేస్తాడు. అప్పుడు ప్రజలు సంతోషిస్తారు.
22. ఈ కలికాలంలో పాపం పోగొట్టుకోవడానికి, పుణ్యం సంపాదించడానికి దైవ నామ స్మరణ ఒక్కటే మార్గం. వీలున్నప్పుడల్లా దేవుడి పేరు తలచుకోవాలి. సత్య యుగంలో ధ్యానం చేస్తే, త్రేతా యుగంలో యజ్ఞ యాగాది కర్మలు చేస్తే, ద్వాపర యుగంలో స్వయంగా కృష్ణుణ్ణి పూజిస్తే ఎంత పుణ్యమో.. ఇప్పుడు కేవలం నామం జపిస్తే అంత పుణ్యం.

హిందువు లెక్కల ప్రస్తుతం శ్రీకృష్ణుడి చనిపోయిన నాటి నుంచి కలియుగం ప్రారంభం. ఇప్పుడు కలియుగంలోని 5118వ సంత్సవరంలో ఉన్నాం. కల్కి పుట్టడానికి చాలా టైం ఉంది. పాపం పెట్రేగిపోయినప్పుడు కల్కి భగవానుడు అవతరిస్తాడని హిందువుల నమ్మకం. నిజాయితీ బతికే వాళ్లు, నిజం మాట్లాడేవాళ్లు, ధర్మం పాటించే వాళ్లు, పద్ధతిగా బతికే వాళ్లు ఉన్నంత కాలం ‘కలి’ చెడు ప్రభావం జనాలపై, దేశం పడదని పెద్దలు చెప్పేది ఇందుకేనేమో!

loading...