News and Entertainment

జ్ఞాన దంతం అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? తీసెస్తే జ్ఞానం పోతుందా?

మనిషి జ్ఞానానికి దంతానికి అసలు సంబంధమే లేదు . మరి ఆపేరు ఎందుకు వచ్చిందో తెలయదు . మనిషికి మొత్తం 32 దంతాలు ఉంటాయి , కింది , పై దవడల్లో కుడి వైపు 8 , ఎడమ వైపు 8 దంతాలు అమరి ఉంటాయి . ఆ 8 దంతాలలో ముందుండే 2 కొరుకుడు(incissors) పళ్ళు , ఒక కోరపన్ను(canine tooth) , 2 అగ్రచర్వనాలు(premolars) , 3 చర్వనాలు(Molars) ఉంటాయి . వీటిలో అన్నిటికన్నా లోపల వుండే మూడవ చర్వనాన్ని (3 rd molar) జ్ఞాన దంతము గా పిలుస్తారు .

ఒక నాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపల్లు తో ఉండేది ... కానీ ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి , లోపలి చర్వనానికి స్థానం ఇరుకైనది . ఈ దంతం సాధారణం గా 15 నుండి 25 ఏళ్ళ మధ్య వస్తుంది . ఇరుకు దవడ లో ఆ పన్ను వచ్చేటపుడు చాల భాధ కలుగు తుంది .

అయితే మరో పదివేల సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యా లో మార్పోచ్చి అసలు జ్ఞాన దంటాలే ఏర్పదకపోవచ్చునన్నది ఉహా . బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది , ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు .
సాధారణంగా మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజింపవచ్చు.
బాల్యం:
ఈ దశలో ఉన్న పిల్లలకు అంటే పుట్టినప్పటినుండి 13 సంవత్సరాల లోపు పిల్లలను బాల్య దశగా పరిగణిస్తారు. ఈ దశలో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి. ఈ దశలో పాలపళ్లు కొన్ని ఊడిపోతుంటే కొన్ని వస్తుంటాయి.

యుక్త వయసు:
సాధారణంగా ఈ వయసుని టీనేజ్ అంటారు. ఈ టీనేజ్ దశ అంటే 13 సం. నుండి 18 సం.వరకు వుంటుంది. అంటే తెలిసీ తెలియని వయసుగా పరిగణిస్తారు. ఈ వయసు వారికి రెండు దవడలలో మొత్త 28 పళ్లు వచ్చేస్తాయి. పూర్తిస్థాయిలో నమల గలుగుతారు. బ్రెయిన్, మేధస్సు తెలివితేటలు మాత్రం పూర్తిగా పరిపక్వతకు రావు.
పరిపక్వ దశ:
సాధారణంగా ప్రౌఢ దశ అంటే 18 సం.నుండి 50 సంవత్సరాల మధ్య వయసు వున్నవారిని ప్రౌఢ దశ లేదా పెద్దవారు అంటారు. వారికి మెదడు పూర్తిగా పరిపక్వం చెంది, వారిలో తెలివితేటలు, జ్ఞానం పెరుగుతుంది. విషయాలను పూర్తిగా అర్ధం చేసుకుని ఆలోచనా శక్తిని కలిగివుంటారు. ఈ వయసులో అంటే 18 నుండి 25 సం.మధ్యలో మూడవ పెద్ద దంతం అంటే దవడకు చివరి భాగంలో వస్తుంది. దీనినే జ్ఞానదంతము అంటారు. అంటే మనకు జ్ఞానం వచ్చే వయసు. బ్రెయిన్ పరిపక్వం చెందే సమయం, వయసులో వస్తుంది కనక దీనిని జ్ఞానదంతం అని పరిగణించడం జరిగింది.

వృద్ధాప్యం:
50 సంవత్సరాలు పైబడిన వారిని వయసు మళ్లిన వారుగా వృద్ధాప్యంగా పరిగణిస్తారు. ఈ వయసులో దంతాలు అరిగిపోవడం, వూడిపోవడం, చిగుళ్లు మెత్తబడిపోయి పంటికి పంటికి మధ్య ఖాళీలు పెరగడం, పళ్లు వంకరలు పోవడం, పళ్ల వయసు ముదిరిపోయి పళ్ల రంగు పసుపు రంగుగా మారడం జరుగుతుంది.

జ్ఞాన దంతం:
దవడ భాగంలో 3వ పెద్ద దంతాన్ని జ్ఞాన దంతం అంటారు. ఈ జ్ఞాన దంతాలు పూర్తిగా వచ్చినట్టయితే మనిషికి 32 పళ్లుంటాయి. లేదంటే 28 పళ్లు మాత్రమే ఉంటాయి. కొంతమందికి వస్తాయి మరి కొంతమందికి రావు. అట్లాగా కొంతమందికి కింది దవడకు రెండు వైపులా రావచ్చు లేక ఒకవైపు రావచ్చు. అట్లాగే పై దవడకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. కొంతమందిలో ఈ జ్ఞానదంతం కొంచెం పైకి కబడుతుంది. మిగిలిన భాగం చిగురుతో కప్పబడి ఉంటుంది. ఈ జ్ఞాన దంతాలు అన్ని పళ్లకంటే ఆలస్యంగా రావడం వలన దవడ ఎముకలో స్థలం లేక కొన్ని దంతాలు సగంపైవచ్చి అలాగే ఆగిపోతాయి. ఆదేవిధంగా వంకరగా కూడా వస్తాయి. మరికొన్నిపరిస్థితుల్లో అడ్డంగా (హారిజాంటల్)కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితి 3వ దంతం అసలు పైకి కనిపించదు. ఇటువంటి దంతాలను ‘ఇంపాక్టెడ్’ దంతాలు అంటారు. ఇవి సాధారణంగా మిగతా అన్ని పళ్లకంటే తక్కువ ఎత్తులో వుండడంవలన పై పళ్లకు కింది పళ్లకు తగలకుండా ఉంటాయి. అంటే మనం ఆహారం నమిలినపుడు ఈ పళ్లకింద పడి నలిగే అవకాశం లేదన్నమాట. కనుక ఈ జ్ఞాన దంతాలవల్ల మనకు ఏమాత్రం ఉపయోగాలు లేవు. పైగా వీటివలన నొప్పి రావడం మరియు ఇతర వ్యాధులకు గురి కావడం జరుగుతుంది.
కండోమ్ ఉపయోగించకుండా…ప్రెగెన్సీని రాకుండా ఉండాలంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు
ఈ అమ్మాయి ఎఫ్‌బీ పోస్టు పెద్ద సంచ‌ల‌నం
పిల్లి ఎదురొస్తే అపశుకునం అంటారు..మరి శవం ఎదురొస్తే
loading...