News and Entertainment

ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు లేదంటే

క్రికెట్ మన మతం. క్రికెట్ మన పిచ్చి. క్రికెట్ ఒక వేలం వెర్రి. భారత దేశం లో క్రికెట్ కు ఉన్నంత ఆదరణ వేరే ఏ ఆటకు లేదన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  చిన్నప్పటి నుంచి మనమందరం క్రికెట్ ఆడుతూ పెరిగిన వాళ్ళమే కదా.
కాని ప్రపంచం మొత్తం పాల్గొనే ఒలింపిక్స్ లో మాత్రం క్రికెట్ కు స్థానం లేదు. ఎందుకు? ఇదే ప్రశ్న చాలా సార్లు  మనల్ని పట్టి పీడించి ఉంటది. ఇండియా కు వచ్చే ఒక్క మెడల్ ని కూడా లేకుండా చెయ్యడానికే అని కూడా మనం అనొచ్చు.
క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ లోనే ఫుట్ బాల్ , హ్యాన్డ్ బాల్  లాంటి అన్ని ఆటలు పుట్టాయి. ఇవన్నీ ఒలింపిక్స్ లో ఉండగా క్రికెట్ ను ఎందుకు వెలివేశారు.కానీ దాని వెనుక అసలు కారణం వేరు.

మొదటి కారణం :
క్రికెట్ వచ్చిన కొత్తలో దాన్ని 6 రోజుల పాటు ఆడే వారు. ఇంకా పురాతన కాలానికి వెళితే రెండు టీములు ఆలౌట్ అయ్యే దాకా ఆడుతూనే ఉండేవారు. అందువల్ల క్రికెట్ ఎక్కువ సమయం కాలం తీసుకునే ఆటగా పరిగణింప బడింది.
ఒలింపిక్స్  కేవలం 16 రోజులలో ముగిసిపోయే పోటీలు .ఒక్క ఆటకే 6 రోజులు పడితే మొత్తం అందరు పోటీ పడటానికి ఎన్ని రోజులు అవసరం ఉంటుంది. అన్న ప్రశ్న తలెత్తడంతో 1900 సందర్భంగా క్రికెట్ ఉంచాలా వద్దా అనే చర్చ మొదలయింది.
రెండవ కారణం :
క్రికెట్ అంటే కేవలం 14 దేశాల్లో, మాత్రమే ఆడే అట. కొన్ని జట్లకు ఇంకా ఐసిసి నుండి అధికారిక గుర్తింపు రాలేదు. అదే మిగతా ఆటలు అయిన ఫుట్ బాల్ టెన్నిస్ లాంటివి కనీసం 100 దేశాల్లో ఆడతారు. అంతర్జాతీయంగా క్రికెట్ ను ఫాలో అయ్యే వారి సంఖ్యా తక్కువే .అతి తక్కువ జాతీయ జట్టులు ఉన్న ఆట అవ్వడంతో అంతర్జాతీయ స్థాయి ఆటగా గుర్తించడం కష్టంగా మారింది.
కానీ రోజులు మారాయి. 6 రోజుల అట ఇప్పుడు 4 గంటల ఆటగా మారిపోయింది. ఇంకా తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే రానున్న రోజుల్లో క్రికెట్ ఒలింపిక్స్ లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.  క్రికెట్ ఇప్పటికైనా కొద్దీ దేశాలకు పరిమితం కాకుండా, ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందితే బాగుండు.
మనకు ఇంకో వరల్డ్ కప్ ఉన్నట్టు ఉంటుంది. కదూ!

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...