News and Entertainment

ఘోరం..బాలుడిపై మహిళ అత్యాచారం...వీడియో తీసి మరీ బెదిరింపు

ఈ రోజుల్లో మితిమీరిపోతున్నాయి. ఒకప్పుడు అమ్మాయిలపై అబాయిలు అత్యాచారాలు చేస్తుంటే ఇప్పుడు మాత్రం అమ్మాయిలే అబ్బాయిలపై అత్యాచారం చేయడం మొదలయింది. తాజాగా జరిగిన అటువంటి సంఘటన మీ ముందుంచుతున్నాం. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై 23 ఏళ్ల మహిళ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల ఓ బాలుడిపై 23 ఏళ్ల మహిళ అత్యాచారం చేయడమే కాకుండా, తనను పెళ్లి చేసుకోవాలని మైనర్ బాలుడిపై ఒత్తిడి తీసుకువచ్చినందుకు సహరాన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోస్కో) సెక్షన్ 7,8 లు, ఐపీసీ 386 సెక్షన్ల కింద నిందితురాలైన మహిళపై ఉత్తరప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలోనే మొట్టమొదటి కేసు పెట్టారు.మైనర్ బాలుడిపై మహిళ అత్యాచారం జరిపిన సంఘటనను వీడియో తీసి, దాన్ని బయటపెడతానని బెదిరించి బాలుడిని పలుసార్లు లైంగికంగా వేధించిందని పోలీసులు చెప్పారు.
తనను పెళ్లి చేసుకోకుంటే బాలుడితో గడిపిన వీడియో క్లిప్పింగును ఆన్ లైన్లో  పెడతానని మహిళ మైనర్ బాలుడిని బెదిరించిందని పోలీసులు తెలిపారు. ముందు బాధిత బాలుడి సోదరుడు మహిళ అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిందితురాలు మహిళ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మహిళపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సహరాన్ పూర్ స్టేషను ఆఫీసర్ పీయూష్ దీక్షిత్ చెప్పారు.మొత్తంమీద ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా  మైనర్ బాలుడితో మహిళకు ప్రేమ వ్యవహారం ఉందని,  పెళ్లి చేసుకోవాలని బాలుడిపై మహిళ ఒత్తిడి తీసుకువస్తే అతను తిరస్కరించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని దీక్షిత్ పేర్కొన్నారు.