News and Entertainment

16 సంవత్సరాల క్రితం రిలయన్స్ మోసం! ఇప్పుడు జియో విషయంలో కూడా రిపీట్ అవుతుందా?

Reliance said it was launching the first mobile phone nearly 16 years ago , ” mutthime Duniya Caro ” was the slogan
సుమారు 16 సంవత్సరాల క్రితం మొట్టమొదటి మొబైల్ ఫోన్ రిలయన్స్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి ” ముట్ఠిమే దునియా కారో” నినాదంతో వచ్చింది. అప్పుడు అనిల్ అంబానీ చేతిలో ఉన్న ”రిం” ఏమి చెప్పిందంటే… “మూడువేలు డిపాజిట్ కట్టితే, అందమైన మొబైల్ ఫోను ఉచితంగా, కనెక్షన్ వెంటనే ఇస్తాము … ఆ తరువాత ప్రతినెలా రూ.600/- కడితే … మీరు ఎంతైనా మాట్లాడుకోండి. అదనపు బిల్లు ఉండదు. మీరు వద్దనుకున్న రోజున, మీ డిపాజిట్ తిరిగి ఇచ్చి వేస్తాం” ఇలా సర్వీసులు ప్రారంభానికి సుమారు 6 నెలల ముందు ప్రకటించింది. అప్పుడు బి ఎస్ ఎన్ ఎల్ లాండు లైను తప్ప మరొక ఫోను లేదు. బి ఎస్ ఎన్ ఎల్ కోసం మూడువేలు కట్టి మూడు – నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చేది. అలాంటి సందర్భంలో పైన చెప్పిన రిలయన్స్ ప్రకటన కోట్లమందిని ఆకర్షించింది. వెంటనే క్యూకట్టి మూడు వేల రూపాయలు డిపాజిట్ కట్టారు. ఆ కోట్ల మంది వెర్రి వాళ్లలో నేను ఒకడిని. ఫోను వచ్చింది. మొదటినెల బిల్లు రూ.1,600/- వచ్చింది. ఫోను వద్దని వాపస్ చేసాను. తిరిగి ఇస్తానన్న డిపాజిట్ ఇవ్వాలేదు.
ఫోను వాపస్ ఇచ్చినా ఆ తరువాత నెల బిల్లు కూడా వచ్చింది. ఇలా హైద్రాబాదులో వేలమంది బాధితులు. కొందరు ”రిలయన్స్ బాధితుల సంఘం పెట్టి” ధర్నాలు చేశారు. పట్టించుకున్న వారు లేరు. అదే సమయంలో కొత్తగా వచ్చిన టి వి 9 … ఈ మోసాన్ని గట్టిగానే ప్రసారం చేసింది . ఇప్పటి సీనియర్ పాత్రికేయురాలు స్వప్న … అప్పుడు కొత్తగా రిపోర్టర్ గా ఉండేవారు . సోమాజిగూడలోని రిలియన్స్ హెడ్ ఆఫీసు సిబ్బంది ఆమెపైన దాడిచేశారు కూడ . ఓ ఐదు సంవత్సరాల తరువాత నాకు లీగల్ నోటీసు వచ్చింది. నేను రిలయన్సుకు ఐదు వేలు బకాయి ఉన్నానని … వెంటనే కట్టకపోతే కోర్టులో కేసు పెడతామని దాని సారాంశం. నేను తవ్వకాలు జరిపి మొత్తం ఫైలు బయటకు తీసి … నేను ఏమీ ఇవ్వనక్కర్లేదని … నా డిపాజిట్ మూడువేలు మీరే వాపస్ ఇవ్వాలని … ఇవ్వకపోతే కేసు పెడతానని సమాధానం పంపాను. ఆ తరువాత వారినుంచి స్పందన లేదు. ఇది జరిగి పది సంవత్సరాలు అయ్యింది. ఈరోజు ముకేశ్ అంబానీ ప్రకటనను చూసి నెట్ లో పూర్తి వివరాలకోసం వెతికితే, ఇదిగో ఈ క్రింది వివరాలు దొరికాయి. జాగర్తగా గమనిస్తే … వారిది ఉచిత టారిఫ్ కాదు … కొంప కొల్లేరు చేసే ”పల్స్” టారిఫ్ కనిపించింది … మీరు జాగర్తగా చూడండి.
ఈవార్త ఇప్పుడు సోషల్ మీడియాలో  హాట్  టాపిక్ అయ్యింది.

అందరికీ షేర్ చెయండి

loading...