News and Entertainment

బిఎస్ఎన్ఎల్ సంచలనం:75 పైసలకే 1 జిబి డేటా

జియో ఉచిత ఆఫర్లతో టెక్ దిగ్గజాలను హడలెత్తిస్తుంటే దానికి కౌంటర్ గా బిఎస్ఎన్ఎల్ సైతం రీ కౌంటర్లతో జియోని హడలెత్తిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ నేఫథ్యంలో జియో కన్నా తక్కువగా 1 జిబి 4జీ డేటాను కేవలం రూపాయి కన్నా తక్కువ ధరకే అందిస్తోంది. కష్టమర్లను తన వైపు తిప్పుకునేందుకు బిఎస్ఎన్ఎల్ ఈ రకమైన ఎత్తుగడలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. బిఎస్ఎన్ఎల్ రీసెంట్ గా ప్రవేశపెట్టిన ప్లాన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి మరి.

కొత్త కష్టమర్ల కోసం అలాగే బ్రాడ్ బాండ్ యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ BB249 పేరుతో ఓ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ప్రకారం 2 ఎంబీపీఎస్ స్పీడ్ తో 2జీబి డేటాను పొందవచ్చు. అది అయిపోయిన తరువాత మీరు ఎటువంటి ఛార్జీలు లేకుండా అన్ లిమిటెడ్ అప్ లోడింగ్ అలాగే డౌన్ లోడింగ్ ను పొందవచ్చు. ఇది 1 ఎంబీపీఎస్ స్పీడ్ తో మీకు లభిస్తుంది.

ఈ ప్లాన్ 6 నెలల వరకు మీరు వాడుకోవచ్చు. అంటే మీకు నెలకు 49 రూపాయల కాస్ట్ అవుతుంది. అదే నెలకు చూసుకుంటే కేవలం 75 పైసలు మాత్రమే ఛార్జ్ అవుతుంది.


ఇది హోమ్ బ్రాడ్ భాండ్ ప్లాన్. దీన్ని కేవలం పర్సనల్ గా వాడుకోవటానికి మాత్రమేననకి కంపెనీ తెలిపింది. దీన్ని కమర్షియల్ గా వాడుకోవటానికి కుదరదని ఆఫీసు పనుల కోసం కూడా వాడుకోలేరని కేవలం మీరు వ్యక్తిగతంగా వాడుకోవటానికేనని కంపెనీ చెబుతోంది.
PAGES:
షేర్ చేయండి

loading...