News and Entertainment

115 రూపాయలతో పోయేదాన్ని 1.86 కోట్లకు తెచ్చుకున్నాడు!



గోరుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకు రావద్దని అంటారు. అయితే గోరుతో పోతుందని భావించకుండా కొందరు గొడ్డలి వరకు తెచ్చుకుని ఆ తర్వాత బాధపడుతారు. తాజాగా అమెరికాలోని ఒక రిటైల్ చైన్ నడుపుతున్న వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురైంది. తన వద్ద వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి అనుమతి లేకుండా, డబ్బులు చెల్లించకుండా స్టోర్లో ఉన్న ఆరంజ్ జ్యూస్ను తాగిందని ఉద్యోగంలోంచి తీసేశాడు. 1.69 డాలర్లు (115 రూపాయల) విలువ చేసే జ్యూస్ తాగినందుకు ఆమెను ఉద్యోగంలోంచి తీసేయడం వల్ల అతడు 2.78 లక్షల డాలర్లు(1.86 కోట్ల రూపాయలు) చెల్లించాల్సి వచ్చింది.


అమెరికాలో ఉన్న చట్టం అతడి పాలిట శాపం అయ్యింది. ఏదైనా జబ్బుతో బాధపడుతున్న వారు అనుమతి లేకుండానే ఏదైనా ఎక్కడ నుండి అయినా తీసుకుని తినవచ్చు లేదా తాగవచ్చు అనేది అమెరికాలో ఉన్న చట్టం. అలాంటి వారిని శిక్షించకూడదు. ఆ స్టోర్లో జాబ్ చేస్తున్న యువతికి మధుమేహం ఉంది. ఒక రోజు ఆమె షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయి. దాంతో ఆమె స్టోర్లో ఉన్న ఆరంజ్ జ్యూస్ను అనుమతి లేకుండా తాగేసింది. దాంతో అతడు జాబ్ నుండి తొలగించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా ఆమె కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆమె తరపున తీర్పు ఇచ్చి 2.78 లక్షల డాలర్లను ఇప్పించింది. అందుకే అంటారు గోరుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవద్దని.


loading...