News and Entertainment

మౌన వ్రతం అంటే ఏమిటి? మౌన వ్రతం ఎందుకు చేస్తారు? దీనివల్ల పొందే లాభాలేంటి..?

పూర్వం మునులు, యోగులు, మహర్షులు మౌనవ్రతాన్ని పాటించేవారు. కానీ ఈ రోజుల్లో కూడా కొంత మంది తాచార్యులు చాతుర్మాస దీక్షలో మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇంకా కొంతమంది నెలలో కొన్ని రోజులు లేక వారానికి ఒక రోజున మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. మౌనం అంటే, ముని వ్రుత్తి..మునులు ఆచరించే విధానం అని అర్ధం. మునీశ్వరులు ఎక్కువగా మౌన వ్రతం పాటిస్తారు. మౌన వ్రతం పాటించేవారు కనుకే వారికి ముని అనే పేరు వచ్చిది. మనకు పంచ జ్జానేద్రియాలు ఉన్నాయి. 

శరీరం కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, వీటన్నింటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం శరీరాన్ని ఎవ్వరూ తాకకుండా, కళ్లతో ఏదీ చూడకుండా, చెవులు వేటినీ వినకుండా, నాలుక ఏమీ మాట్లాడకుండా, లేక ఘన ఆహారం ఏమీ తినకుండా , ముక్కతో ఉశ్చ్వాస..నిశ్చ్వాస క్రమాలు, క్రమబద్దీరకంగా ఉండగలిగిండాలి. ఇవేకాక, శరీరంలోని మిగితా ఇంద్రియాలన్నే కలిపి దశ ఇంద్రియాలు కూడా పూర్తిగా మౌనం పాటించడం, నిజమైన మౌన వ్రతం పాటించడం

అందుకే మౌన వ్రతం చేయునప్పుడు, ద్రవ ఆహారం తీసుకోవాలి అంటారు. కానీ ఘన ఆహారం కాదు. కడుపు నిండితే నిద్రపోతాయే తప్ప, ఇంక దైవ ధ్యానంపై ఆసక్తి ఎక్కడ ఉంటుంది? ఇంత నిష్టగా చేసే మౌన వ్రతం, ఒక్క క్షణం చేసినా చాలు. మనం పుట్టిన నాటి నుండి, జీవించి ఉన్నంత కాలం, నిరంతరం ఆగకుండా పనిచేసే ఏకైక యంత్రం, మనవ శరీరం. మరి ఈ శరీరాన్ని మౌన వ్రతం వల్ల అయినా, కానీసం కాసేపైనా సరే విశ్రాంతి తీసుకునేలా చేసుకోగలిగితే, 'దేహమే దేవాలయం' అన్న వాఖ్యానికి నిర్వచనం ఇచ్చినట్లుగా ఉంటుంది. 

ఇప్పటికీ చాలామంది చాతుర్మాస దీక్షలోనో లేక వేరో ఏదో కొన్నిరోజులో లేకపోతే ఫలానా వారమనో మౌన వ్రతాన్ని పాటిస్తున్నారు. ఇది ఎందుకు చెయ్యాలి? దీని వల్ల ఉపయోగం ఏమైనా వుంటుందా?
తప్పకుండా వుంటుంది. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా మౌనవ్రతం మనిషికి ఎంతో మేలు చేస్తుంది.ఆధ్యాత్మికంగా చూస్తే మౌనవ్రతం వల్ల వాక్శుధ్ది, వాక్ శక్తి పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే మనని మనం ప్రశాంతంగా వుంచుకోవటానికీ, కోపాన్ని అదుపులో పెట్టుకోవటానికి ఈ మౌనవ్రతం ఉపయోగపడుతుంది. సిధ్ధులు వాక్ శక్తిని పెంచుకోవటానికి, వాళ్ళని వాళ్ళు ప్రశాంతంగా వుంచుకోవటానికి ఎక్కువగా మౌనవ్రతాన్ని పాటిస్తారు.
Pages:
1   2   3   4

షేర్ చేయండి

loading...