News and Entertainment

కలకలం రేపుతున్న అశ్లీల చిత్రాల చిత్రీకరణ.. ఎక్కడో తెలుసా..?


శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస పరిసర ప్రాంతాల్లో నీలి చిత్రాలు చిత్రీకరణపై కలకలం సృష్టిస్తుంది. గత మూడు రోజులుగా ఈ నీలి చిత్రాల చిత్రీకరణ అనేది చిన్నా పెద్ద అందరి నోటా హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే అదే పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ఈ నీలి చిత్రాలు చిత్రీకరించి విడుదల చేశారని సమాచారం. ఈ నీలి చిత్రాల్లో ఉన్న వ్యక్తులు అందరికీ తెలిసిన వారేనని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ చిత్రాల్లో పట్టణానికి చెందిన యువకులు, మహిళలు ఉన్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఈ చిత్రాలు సామజిక మాధ్యమాల ద్వారా ఒకరి నుంచి మరొకరు షేర్ చేసుకొని పట్టణంలోని యువకుల సెల్‌ఫోన్లలో హల్‌చల్‌ చేస్తున్నాయని సమాచారం.

దీనిపై పోలీసులు దృష్టి సారించక పోవడంతో పాటు, సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఆమదాలవలస పట్టణంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, తమ పిల్లలను చదివించుకోవాలంటే భయమేస్తోందని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఆమదాలవలసలో నీలిచిత్రాలు చిత్రీకరణ అంశంపై స్థానిక సీఐ డి.నవీన్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా తమకు ఫిర్యాదులు రాలేదన్నారు.
అందరికీ షేర్ చెయండి


loading...