News and Entertainment

బ్రేకింగ్ : క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఇందుకే చంపాడు..లీకైన బాహుబ‌లి-2 స్టోరీ


చాలా కాలంగా టాలీవుడ్ జ‌నాల‌ను స‌స్పెన్స్‌కు గురిచేస్తున్న క‌ట్ట‌ప్ప సీక్రెట్ బ‌య‌ట‌ప‌డేలా ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. బాహుబ‌లి ది బిగినింగ్ పేరిట ప్ర‌జ‌ల‌ను ఆత్య‌ర్యానికి గురిచేసిన బాహుబ‌లి మ‌ర‌ణానికి కార‌ణం తెలిపేందుకు, గ‌తంలో చూడ‌ని విధంగా బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ పార్ట్‌ను చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.

 ప్ర‌స్తుతం ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో ద్వారా వినిపిస్తున్న ఈ స్టోరీ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌పెంచేదిగా ఉండ‌టం విశేషం. ఇంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీకి రాజ‌మౌళి అద్భుత‌మైన ద‌ర్శ‌కత్వం తోడైతే , ఊహించ‌ని వండ‌ర్స్ బాహుబ‌లి చెంత‌కు చేరుతాయ‌నేది ప్ర‌భాస్ అభిమానుల‌లో గ‌ట్టిగా వినిపిస్తుంది.

అయితే బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు. ఈ విష‌యం షూటింగ్ స్పాట్‌లో పాల్గొన్న ప్ర‌భాస్ , రానాల‌కు కూడా షూటింగ్ చేస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌. అయితే బాహుబ‌లి టీమ్‌కు సంబందించిన స‌న్నిహితుల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చిన బాహుబ‌లి -2 స్టోరీ ఇదే..

” కాళ‌కేయ‌తో యుద్దం త‌ర్వాత మాయిష్మ‌తి సామ్రాజ్యానికి మ‌హారాజుగా మార‌తాడు బాహుబ‌లి. ఆ త‌ర్వాతే దేవ‌సేన‌(అనుష్క‌)ను చూసి తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. బాహుబ‌లితో ప్ర‌తీ విష‌యంలో పోటీ ప‌డే త‌త్వం ఉన్న బ‌ల్లాల‌దేవుడు కూడా దేవ‌సేన‌ను కావాల‌నుకుంటాడు. ఈ విష‌యం తెలిసిన శివ‌గామిణి దేవి దేవ‌సేను పెళ్లాడాల‌నుకున్నవారు రాజ్యం వ‌దిలి వెళ్లిపోవాల‌ని అంటుంది. దేవ‌సేన కోసం రాజ్యాధికారాన్ని వ‌దిలి వెళ్లిపోతాడు బాహుబ‌లి. ఇదే స‌మ‌యంలో రాజుగా మార‌తాడు బ‌ల్లాల‌దేవుడు. త‌న తండ్రి కాళకేయుడ్ని చంపిన వారిపై ప‌గ తీర్చుకునేంద‌కు మాయిష్మ‌తి సామ్యాజ్యంపై దండెత్తుతాడు కాళ‌కేయుడి కొడుకు. రాజ్యాన్ని మొత్తం అల్ల‌క‌ల్లోలం చేసేస్తాడు. రాజ్యాన్ని కాపాడుకునేంద‌కు సామాన్య వ్య‌క్తిగా యుద్ద భూమిలోకి అడుగుపెట్టిన బాహుబ‌లి శ‌త్రువుల‌ను చీల్చిచెండాడుతాడు. ఇది చూసిన శివ‌గామిణి దేవి బాహుబ‌లిని మ‌రోసారి రాజుగా చేయాల‌నుకుంటుంది. ఇది గ‌మ‌నించిన బ‌ల్లాల‌దేవుడు సేనాదిప‌తి క‌ట్ట‌ప్ప‌కు బాహుబ‌లిని చంప‌మ‌ని ఆగ్నాపిస్తాడు. రాజ్యానికి బానిస అయిన క‌ట్ట‌ప్ప‌, రాజు మాట కాద‌న‌కూడ‌ద‌నే కార‌ణంతో సామాన్యుడిగా ఉన్న బాహుబ‌లిని చంపేస్తాడు.. అప్ప‌టికే శివుడికి జ‌న్మ‌నిచ్చిన దేవ‌సేన ద‌గ్గ‌ర నుండి శివుడిని తీసుకుని శివ‌గామిణి దేవి రాజ్యం నుండి త‌ప్పించుకోగా, దేవ‌సేన‌ను జీవిత‌కాల బంధీగా మారుస్తాడు బ‌ల్లాల‌దేవ‌.. ఈ విష‌యం తెలుసుకున్న శివుడు క‌ట్ట‌ప్ప స‌హాయంతో బ‌ల్లాల‌దేవుడిపై తిరుగుబాటు చేస్తాడు.”

ప్ర‌స్తుతం ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో ద్వారా వినిపిస్తున్న ఈ స్టోరీ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌పెంచేదిగా ఉండ‌టం విశేషం. ఇంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ స్టోరీకి రాజ‌మౌళి అద్భుత‌మైన ద‌ర్శ‌కత్వం తోడైతే , ఊహించ‌ని వండ‌ర్స్ బాహుబ‌లి చెంత‌కు చేరుతాయ‌నేది ప్ర‌భాస్ అభిమానుల‌లో గ‌ట్టిగా వినిపిస్తుంది.
అందరికీ షేర్ చెయండి


loading...