News and Entertainment

మీరు నెట్ సెంటర్ కు వెళ్తున్నారా... అయితే జాగ్రత్త...!



శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస పట్టణం. అక్కడొక ప్రబుద్దుడు తన చపలచిత్తం తో చేసిన పనులు అక్కడ కలకలం రేపాయి. అభం శుభం తెలియని ఆడవాళ్లే అతని టార్గెట్. అమాయకపు ఆడపిల్లలను ట్రాప్ చేసి వారి తో దిగిన చిత్రాలను ఒక నెట్ సెంటర్లో మొబైల్ ఫోన్లలో అప్ లోడ్ చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. ఆ అమ్మాయిల పరువును గంగలో కలిపెస్తున్నాడు. ఈ విషయం గత కొన్ని రోజులుగా ఆముదాలవలస పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. ఏ మొబైల్ ఫోన్లో చూసినా అవే అశ్లీల చిత్రాలు. అ చిత్రాల్లో ఉన్నది అందరికీ తెలిసిన వారు కావడంతో అక్కడ మరింత కలకలం సృష్టించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. వారు రంగంలోకి దిగి విచారించగా ఈ కార్యకలాపాలు చేసింది మహేష్ అనే నీచుడు అని తేల్చారు.

మహేష్ ది ఆముదాలవలస పట్టణం. అతను కంప్యుటర్ గ్రాఫిక్స్ నేర్చుకొని మొదట సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేయడం ప్రారంబించాడు. ఈ నేపధ్యంలో అతని పుర్రెకో పాడుబుద్ధి ఏర్పడింది. నెట్ సెంటర్ కు వచ్చే అమ్మాయిలపై అతని దృష్టి పడింది. వారిపై అశ్లీల చిత్రాలు తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. నెట్ సెంటర్ కు వచ్చే విద్యార్దినులు పెళ్ళయిన యువతులకు మాయ మాటలు చెప్పి లోబర్చుకునేవాడు.

వారితో పనయ్యాక తన నిజ స్వరూపాన్ని బయటపెట్టేవాడు. వారితో అశ్లీల చిత్రాలను వారికి తెలియకుండా చిత్రీకరించేవాడు. ఈ అశ్లీల చిత్రాలు చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. వారిని బెదిరించి డబ్బులు తీసుకునేవాడు.


ఈ అశ్లీల చిత్రాలతో మరింత ఎక్కువ సంపాదించాలని భావించిన మహేష్ వాటిని ఓ నెట్ సెంటర్ ఓనర్ కు ఇచ్చి అవి నెట్ లో అప్లోడ్ చేయడం అవి మొబైల్ ఫోన్లకు చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. ఈ వ్యవహారం పట్టణమంతా పాకి జిల్లలో సంచలనం సృష్టించడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు మహేష్ మాత్రం పోలీసుల చేతికి చిక్కలేదు. అతని కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే ఆముదాలవలస పట్టణంలో అమ్మాయిలకు భద్రతా లేకుండా పోయిందని వెంటనే ఆ నిందితుడిని అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని పలువురు కోరుతున్నారు.