News and Entertainment

తెల్లవారు జామున శృంగారంలో పాల్గొంటే మీలో జరిగే మార్పులేంటో మీకు తెలుసా?


రాత్రిపూట రతిక్రీడ మహదానందంగా ఉండవచ్చు, కానీ ఉదయం పూట ఉల్లాసంగానూ, ఉద్వేగపూరితంగానూ ఊపేయవచ్చు. ఉదయం మసక మసక వెలుతురులో బద్దకంగానూ బరువుగానూ మీ భాగస్వామితో రతిక్రీడను సాగిస్తే పడక మీంచి లేచిన తర్వాత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఉదయం పూట శృంగార క్రీడ వల్ల శారీరక, మానసిక వ్యాయామం జరుగుతుంది. ఈ విషయాన్ని నిపుణులు ధ్రువీకరించారు కూడా.

ఉదయం పడక మీంచి లేవాలంటే బద్దకంగా ఉంటుంది. బద్దకాన్ని వదిలించుకోవడానికి ఉదయం పూట రతిక్రీడ పనికి వస్తుంది. దంపతులు ఇద్దరు శృంగారంలో తెల్లవారుజామున ఊగిపోతే చలాకీగా పనులు చేసుకునే ఉల్లాసాన్ని పొందుతున్నారు. కార్యాలయానికి ఆలస్యం కాకుండా ఇద్దరు కలిసి స్నానం చేయవచ్చు.

కలిసి వంట గదిని వేడెక్కించి, కావాల్సినవి తయారు చేసుకోవచ్సు. మార్నింగ్ సెక్స్ వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. పనిని కూడా చురుగ్గా చేయగలరు. ఉదయంపూట రతిక్రీడకు సంబంధించిన మధురోహలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవరకు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి. పరవశులను చేస్తాయి.