News and Entertainment

పైరసీలో సినిమా చూడటం నేరం కాదు అంట


ఈమధ్యనే చదువుకున్నాం మనం, గవర్నమెంటు బ్లాక్ చేసిన వెబ్ సైట్లను విసిట్ చేసిన గాని, పైరసీలో సినిమాలు చూడటం, డౌన్లోడ్ చేయడం లాంటివి చేసిన కాని 3 ఏళ్ళ జైలు శిక్షతో పాటు 3,00,000 రూపాయల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని. అయితే, బాంబే హైకోర్టు ఈ విషయాన్ని సమర్థించట్లేదు. సినిమాలు పైరసీ ద్వారా చూడటం నేరం కాదని చెప్పింది కోర్టు.

కాపీరైట్ చట్టం కింద పైరసీ చేసేవారు, అమ్మేవారు శిక్షకి అర్హులు కాని, చూసేవారు కాదని, అందుకే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISP) తమ ఎర్రర్ మెసేజ్ లో డౌన్లోడ్ చేసినందుకు, ఎగ్జీబీట్ చేసినందుకు, డూప్లీకేట్ చేసినందుకు శిక్ష అనే బదులు న్యాయపరమైన మెసేజ్ ని బ్లాక్ చేసిన సైట్లలో పెట్టాలని జస్టిస్ గౌతమ్ పటేల్ అభిప్రాయపడ్డారు.

అలాగే కాపిరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తే సెక్షన్, 63, 63-A, 65, 65-A కింద మూడు సంవత్సరాల జైలు, మూడు లక్షల జరిమానా విధించబడుతుందని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్ (ISP) బ్లాక్డ్ యూఆర్ఎల్స్ పై తెలుపాలని కోర్టు ఆర్డర్ వేసింది.

ఇలా రోజుకో మాట బయటకి రావడంతో నెటిజన్లు ఏ విషయం నమ్మాలో అర్థం కాక మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ కొన్ని టొరెంట్ సైట్లు అలానే పనిచేస్తున్నాయి. వాటినుంచి ఏదైనా కంటెంట్ డౌన్లోడ్ చేయడానికి ధైర్యం చేయట్లేదు చాలామంది నెటిజన్లు. మరి బాంబే కోర్టు స్టెట్‌మెంట్ వారికి ఉపశమనాన్ని కలిగిస్తుందో లేదో చూడాలి.
అందరికీ షేర్ చెయండి


loading...