News and Entertainment

శభాష్ బద్దకస్తులు..మీకు అభినందనలు..ఎందుకు?


పనీ పాటు లేకుండా ఖాళీగా కూర్చున్నందుకో ఏమోగాని బద్దకస్తుల్లో ఉన్నన్ని తెలివితేటలు పనిచేస్తున్న వారికి ఉండనే ఉండవట. అందుకేనండీ ఓ పరిశోధన బద్ధకం పరమఔషధం అని కితాబు సైతం ఇచ్చేసింది. ఎక్కువ సమయం ఆలోచనలకే పరిమితమయ్యే వీరిలో మేథావితనం మెండుగా ఉంటుందని ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. అమెరికాలోని ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ యూనివర్శిటీ తాజా అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కొందరు విద్యార్థులతో మూడు దశాబ్దాలకు పైగా అధ్యయనం చేసి మరీ ఈ సంగతిని కనిపెట్టింది. ఆ విశేషాలు మీకోసం..

* బద్దకస్తులు మేథావులుగా రూపుదిద్దుకుంటారట. ఎప్పుడూ చురుకుగా ఉండే వారితో పోలిస్తే వీరిలోఇంటెలిజెన్స్ పాళ్లు ఎక్కువట.

* ఎక్కువ ఐక్యూ ఉండేవారిలో విసిగిపోవడం అనేది తక్కువగా ఉంటుందట. దాంతో వారు ఎక్కువ సమయం ఆలోచనలకే వెచ్చిస్తుంటారని ఆ అధ్యయనంలో తేలింది. 

* కొందరు థింకర్స్, మరికొందరు నాన్-థింకర్స్‌ను ఎంపిక చేసింది. వారం రోజుల పాటు వారి చేతి మణికట్టుకు ఒక పరికరాన్ని అమర్చి వారి కదలికలు, చురుకుదనం స్థాయిలను ఎప్పటికప్పుడు రికార్డు చేశారు. 

* నాన్-థింకర్స్ చాలా తేలిగ్గా బోర్‌ ఫీలవుతారని, శారీరకమైన యాక్టివిటీతో వారు ఆ విసుగుదలను అధిగమించుకోవాల్సి ఉంటుందని పరిశోథకులు తేల్చారు. 

* యాక్టివిటీ తక్కువగా ఉండే వారు తామెంత మేథావులనేది దానిని పక్కనపెట్టి తమ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు మాత్రం తమ చురుకుదనం స్థాయిని పెంచుకోవాల్సి ఉంటుందని సలహానిచ్చింది.
షేర్ చేయండి


loading...