News and Entertainment

బెడ్ రూంకి అమ్మాయిని పంపిస్తే చాలు.. లోన్ ఇచ్చేస్తారట



బ్యాంకు లోన్ తీసుకోవడానికి అర్హతలేకున్నా ఫర్వాలేదు. ఆయన చెప్పినట్లు చేస్తే చాలు. చాలా ఈజీగా లోన్ ఇచ్చేస్తారట. అయితే ఆయన ఏమి చెబుతున్నారనే అసలు విషయం. ఆయన బెడ్ రూం కి అమ్మాయిని పంపించాలట. ఇట్టే లోన్ ఇచ్చేస్తారట. ఆ వివరాలలోకి వెళితే.. ఆయన కడప జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు జీఎం. పేరు వెంకటేశ్వర్లు. మందు, మగువను ఎరగా వేస్తే.. ఎక్కడికైనా వచ్చి, ఆనందించి.. ఆపై లోన మంజూరు చేస్తారట. అయితే ఆయన గారి భాగోతం బయట పెట్టాలని కొందరు భావించారు.


దీనితో.. ఓ హోటల్ గదిలో రహస్య కెమెరా పెట్టేశారు. ఓ గుర్తు తెలియని లాడ్జిలో ఓ యువతితో వెంకటేశ్వర్లు నడిపిన రాసలీలల దృశ్యాలు తాజాగా బయటపడడంతో.. ఇప్పుడు కడప జిల్లాలో కలకలం రేపుతున్నాయి. అయితే.. "ఆ వీడియో నాది కాదు. బినామీ రుణాలకు సహకరించలేదన్న అక్కసుతో కొందరు ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టించారు" అని ఆయన చెబుతున్నారు. కానీ.. ఈ వీడియోలో మాత్రం ఆయన స్పష్టంగా కనిపిస్తున్నారట. మరి నిజమేంటో.. త్వరలోనే బయటకి వస్తుంది.