News and Entertainment

తన తండ్రి కామపైశాచికత్వాన్ని బయటపెట్టిన ఓ అభాగ్య కూతురు


ప్రతి రోజూ ఇలాంటివి దేశంలో ఎదో ఒక చోట జరుగుతున్నట్టుగా మనం వింటూనే వున్నాం చూస్తూనేవున్నాం. విషయంలోకి వెళితే

భాధ్య‌తాయుత‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉంటూ ప‌దిమందికి ఆద‌ర్శంగా ఉండ‌వల్సిన ఓ ప్ర‌బుద్దుడు సొంత క‌న్న కూతురి ప‌ట్ల కామ‌పిశాచిగా మారాడు. మ‌గ‌బిడ్డని ఇవ్వ‌నందుకు త‌న భార్య‌కి, కూతురిగా పుట్టినందుకు ఆ అమాయ‌క‌పు యువ‌తికి న‌ర‌కం చూపించాడు. సభ్య స‌మాజాన్ని త‌ల‌దించుకునే విధంగా చేసిన ఈ ఘ‌ట‌న జైపూర్‌లో జ‌రిగింది.రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ మీనాపై ఆయన కూతురు ఆరోపణలు చేసింది. నా తండ్రి ప్ర‌భుత్వ ఉద్యోగి కాదు.. ఓ కామ పిశాచి అంటూ ఆమె చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు అంత‌టా వినిపిస్తున్నాయి.

‘మానాన్న నన్ను భారంగా భావించేవాడు. నాపై చేసే ప్రతి రూపాయి లెక్కగట్టేవాడు. తిట్టేవాడు. నన్ను అభ్యంతరకరంగా ముట్టుకునేవాడు. నేను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నన్ను లైంగికంగా వేధించాడు. నా గదిలోకి వచ్చేవాడు. చెప్పరాని చోట చేతులు వేసి అభ్యంతరకరంగా తాకేవాడు. ఇలా రెండేళ్లు చేశాడు. ప్రతి రోజు కుమిలిపోయేదాన్ని. చివరకు ధైర్యం చేసి ఈ విషయాన్ని అమ్మతో చెప్పాను. దాంతో పోలీసులకు చెప్తానని కూడా అమ్మ బెదిరించింది. మగ సంతానం కావాలని అమ్మను విడాకులు అడిగారు. రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందని మొత్తం కుటుంబ సభ్యులు వేధించారు. నేను ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పోలీసులు రాజీ కుదిర్చి ఆయనకు అనుకూలంగా ఉండేలా చేశారే తప్ప న్యాయం చేయలేదుస అంటూ త‌న గోడును హైకోర్టుకు ఏప్రిల్ 21న ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది..

                                ఈ స‌మ‌స్య‌ని ప్ర‌ధాన మంత్రికి వివ‌రించేందుకు ఆయ‌న ఆపాయిమెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆమె వివ‌రించారు. ప్ర‌స్తుతం లండ‌న్‌లో చ‌దువుకుంటున్న ఈ యువ‌తి ఫిర్యాదుపై ఓం ప్రకాశ్ ను ప్రశ్నించగా ఆమె ఆయన భార్య, కూతురు తనపై చాలా కేసులు పెట్టారని, రెండు కేసుల్లో ఓడిపోయారని అన్నారు. ఐదేళ్లుగా వారు దూరంగా ఉంటున్నారని చెప్పిన ఆయన ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న కూతురు బ్రిటన్ లో ఉంటుందని, ఆమె చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని చెప్పారు.
షేర్ చేయండి




loading...