News and Entertainment

పార్క్ లో మమ్మల్ని రేప్ చేస్తుంటే...మా బాయ్‌ఫ్రెండ్స్ గుడ్లప్పగించి చూశారు.


రాజధాని నగరమైన ఢిల్లీ లో ఇద్దరు అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి సాయంత్రం సరదాగా పార్కుకెళ్లారు...ఆపై గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన రాజధానిలో సంచలనం సృష్టించింది. అమన్ విహార్ మురికివాడకు చెందిన 17,18 ఏళ్ల ఇద్దరు బాలికలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి ప్రేమికులకు కేంద్రమైన ముండ్క మెట్రోస్టేషను సమీపంలోని ఎన్డీపీఎల్ మైదానానికి విహారానికి వెళ్లారు. అంతలో ఐదుగురు దుండగులు వారిని చూసి బాయ్‌ఫ్రెండ్స్‌ను కొట్టి వారిని మూలన కూర్చోబెట్టి, వారిముందే ఇద్దరు బాలికలపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు.
ఘటన జరిగిన అనంతరం ఈ సంఘటన గురించి పోలీసులకు చెపితే చంపేస్తామని బెదిరించారు. అనంతరం రోడ్డుపై పోలీసు వాహనం కనిపిస్తే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధిత బాలికలను వైద్య పరీక్షకు పంపించగా వారిపై సామూహిక అత్యాచారం జరిగిందని తేలింది. అత్యాచారం చేస్తుండగా

తాము అడ్డుకుంటే దుండగులు తమను చంపేసే వారని బాధిత బాలికలు రోదిస్తూ చెప్పారు. బాధిత బాలికలు మెట్రోరైలు పనులు చేస్తున్న కూలీల కూతుళ్లని పోలీసులు చెప్పారు. పోలీసులు రేప్ చేసిన నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని జైలుకు రిమాండుకు పంపించామని పోలీసులు వివరించారు.

ఇది ఇలా ఉండగా రేప్ కు గురైన యువతులు పోలిసుల ముందు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతుంది. ఆ వాంగ్మూలం ఏంటంటే "మాపై ఐదుగురు దుండగులు సామూహికంగా అత్యాచారం చేస్తుంటే... మాతో వచ్చిన మా బాయ్‌ఫ్రెండ్స్ మౌన ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉన్నారు... వారు పెద్దగా అరచి మమ్మల్ని కాపాడుతారని మేం భావించామని, కాని వారు ఓ మూలన కూర్చొని తమపై సాగుతున్న దురాగతాన్ని చూస్తుండిపోయారు". వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ లో ఒకరైతే కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా నిరాకరించాడని ఆవేదన వ్యక్తం చేసారు.


loading...