News and Entertainment

450 కిలోమీట‌ర్లు క్యాబ్ లో తిరిగినందుకు… రూ.9 ల‌క్ష‌ల బిల్ వచ్చింది.


హైద‌రాబాద్ న‌గ‌రంలోనే కాదు, దేశంలోని ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఓలా, ఊబ‌ర్ వంటి క్యాబ్ స‌ర్వీసులు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. చ‌వ‌క ధ‌ర‌ల‌తో వ‌స్తున్న కార‌ణంగానే చాలా మంది ఈ క్యాబ్ స‌ర్వీస్‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నారు. అయితే అలా అనుకునే హైద‌రాబాద్‌ న‌గరానికి చెందిన ఓ వ్య‌క్తి ఓలా క్యాబ్ సేవ‌ను వినియోగించుకున్నాడు. అందులో దాదాపు 450 కిలోమీట‌ర్ల దూర ప్ర‌యాణం చేశాడు. ఈ క్ర‌మంలో మ‌హా అయితే అత‌నికి రూ.5వేల వ‌ర‌కు బిల్లు రావాలి. కానీ అతనికి వ‌చ్చిన బిల్ మొత్తం ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.9 ల‌క్ష‌లు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. అదేంటీ బిల్లు ఎందుకు అంతలా వ‌స్తుంది, అత‌ను వెళ్లింది విమానంలోనో, హెలికాప్ట‌ర్‌లోనో కాదుగా. కారులోనేగా. అంటారా..? అవును, కారులోనే వెళ్లాడు. కానీ బిల్లు మాత్రం రూ.9 ల‌క్ష‌లు వ‌చ్చింది.


హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ర‌తీష్ శేఖ‌ర్ నిజామాబాద్‌కు వెళ్లి వ‌చ్చేందుకు గాను రౌండ్ ట్రిప్‌గా ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. మొత్తం అత‌ను 450 కిలోమీట‌ర్ల పాటు ప్ర‌యాణం చేశాడు. అయితే అత‌నికి లెక్క ప్ర‌కారం రూ.5వేల వ‌రకు బిల్ రావాలి. కానీ రూ.9,15,887 బిల్లు వ‌చ్చింది. దీంతో శేఖ‌ర్ ఒక్క‌సారిగా అవాక్క‌య్యాడు. కానీ వెంట‌నే తేరుకుని ఓలా క‌స్ట‌మ‌ర్ కేర్‌ను సంప్ర‌దించాడు. అయితే వారు త‌మ యాప్‌లో లోపం కార‌ణంగానే అంత‌టి బిల్లు వచ్చింద‌ని చెప్పి, లోపాన్ని స‌రిదిద్ది అత‌నికి అస‌లు అయిన రూ.4,812 బిల్లును వేశారు. దీంతో శేఖ‌ర్ ఊపిరి పీల్చుకుని బిల్లును చెల్లించాడు.
రూ.9 ల‌క్ష‌ల బిల్లు రావ‌డం ఏమో గానీ ఇప్పుడు ఓలానే కాదు, అలాంటి క్యాబ్ సేవ‌ల‌ను అందించే యాప్స్ ప‌ట్ల వినియోగ‌దారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. తాము ఇప్ప‌టి వ‌ర‌కు బిల్లుల‌ను కచ్చిత‌మైన రేట్ల‌కే చెల్లించామా, లేదంటే ఎక్కువ చెల్లించామా అని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క్యాబ్ సేవ‌ల యాప్‌ల ప‌నితీరుపై సంబంధిత ప్ర‌భుత్వ అధికారులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ సంఘ‌ట‌న‌ను దృష్టిలో ఉంచుకుని, మీరు కూడా ఇక‌పై క్యాబ్‌లో వెళ్తే, బిల్లు పేమెంట్ చేసే ముందు మీరు తిరిగిన కిలోమీట‌ర్ల‌ను ఒక‌సారి చెక్ చేసుకోవ‌డం బెట‌ర్‌. లేదంటే అధిక మొత్తంలో బిల్లు చెల్లించాల్సి రావ‌చ్చు.
అందరికీ షేర్ చెయండి

ఛాన్స్ ఇచ్చిన టీచ‌ర్‌కు చుక్క‌లు చూపించిన కుర్రాళ్ళు..(వీడియో)

పోర్న్‌సైట్‌లో విజ‌య‌వాడ అమ్మాయి అశ్లీల వీడియోలు


loading...