News and Entertainment

సాయంత్రం వేళ ఈ పనులు చేయకండి.. చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహనికి గురికాక తప్పదు..!


పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు, నిబంధనలు పెట్టారు. అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు, నమ్మకం లేని వాళ్ళు పాటించరు. అయితే సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. సాయంత్రం సమయంలో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ.. మనకు ఉన్న కొన్ని అలవాట్లు.. మనపై, మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట. హిందువుల ప్రకారం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, మన ఇంటిని ఆమె ఆకర్షించేలా చేసినప్పుడు.. సంపద, శ్రేయస్సు ఎప్పటికీ.. మీ ఇంటిని వదిలివెళ్లదు.
సంపద, శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే.. ధనం మన ఇంటికి వస్తుందని చెబుతాయి. మీకు తెలుసా? మీకున్న చిన్న చిన్న అలవాట్లే.. మీ అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను వెంటనే మార్చేస్తాయి. మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. మన చిన్న చిన్న అలవాట్లే.. ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం..

1. తులసిని పూజించకూడదు:

హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసీని పూజించడం, ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. తులసి మొక్కను పూజించడం, నీళ్లు పోయడం చాలా పవిత్రంగా భావిస్తాం. కానీ.. సాయంత్రంపూట ఇది మంచిది