News and Entertainment

బ్లూఫిల్మ్‌లు చూస్తే ఆ ప్ర‌మాదం తప్ప‌ద‌ట !

 
దాంప‌త్య సుఖ‌మ‌య జీవితానికి వాత్సాయ‌న కామ‌సూత్రాలు ఫాలో కావాల‌ని, వాటిని అనుస‌రిస్తే శృంగారంలో సుఖ‌మ‌యం జీవితాన్ని పొంద‌వ‌చ్చ‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అది నిజ‌మే అయినా… అది కూడా శృతిమించితే ప్ర‌మాద‌మే అని చెప్పాలి. కొంత మంది దంపతులు తరచుగా నీలి చిత్రాలు చూస్తుంటారు. అది దాంపత్య జీవితంలో మామూలు విషయమే అనుకున్న‌ప్పటికీ అయితే అటువంటి వారు ఓ ప్రమాదాన్ని ఎదుర్కోక‌త‌ప్ప‌దు అని అమెరికాలోని ఓ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆ విష‌యం ఏమిటంటే

దంపతులు తరచుగా నీలి చిత్రాలు చూస్తే వైవాహిక జీవితానికి ముగింపు పలికే ప్రమాదముందని అమెరికాలోని ఓక్లాహామా వర్సిటీ అధ్యయనంలో తేట‌తెల్ల‌మైంది. ఆ వీడియోలు విడాకుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతున్నట్టు వారి పరిశోధనలో తెలిసిందని చెప్పారు. నీలి చిత్రాల వీక్షణం విడాకులు తీసుకునే సంభావ్యతను పురుషుల్లో రెట్టింపు చేస్తుందని, అదే మహిళల్లో ఇది మూడింతలు ఉంటుందని వారు తెలిపారు. మహిళల్లో వీడియోలు చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడమే దీనికి కారణమని చెప్పారు. యువ దంపతుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంద‌ట‌. యువకులే నీలి చిత్రాలను ఎక్కువ చూస్తారని, అయితే వయసు పెరుగుతున్న కొద్ది నీలి చిత్రాల ప్రభావం అంత‌గా వారి మీద ఉండ‌ద‌ని, క్ర‌మేణ తగ్గుతుందని ఓక్లాహామా పరిశోధకులు వెల్లడించారు.

loading...