News and Entertainment

హస్తప్రయోగం చెడ్డ అలవాటని, దానికి లేనిపోని అపోహలు


పూర్వం యువతీయువకులకి హస్తప్రయోగం అలవాటు అవకుండా, హస్తప్రయోగం చెడ్డ అలవాటని, దానికి లేనిపోని అపోహలు అంటగట్టారు పెద్దలు. వాటిని ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ ఆపోహల్లో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.


హస్తప్రయోగం వలన మొటిమలు వస్తాయి :
అసలు ఏమాత్రం లాజిక్ లేని అపోహ ఇది. ఇలాగైనా యువతీయువకులు హస్తప్రయోగం అంటే భయపడతారని ఒకనాటి పెద్దల ప్లాన్.
హస్తప్రయోగం వలన వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది :
మతపెద్దలు సృష్టించిన విచిత్రాల్లో ఇదొకటి. నిజానికి వీర్ణకణాలు తగ్గడానికి, హస్తప్రయోగానికి ఎటువంటి సంబంధం లేదు. మన ఆహారపు అలవాట్లు, మన మానసిక స్థితి, జీన్స్ మాత్రమే వీర్యకణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.
హస్తప్రయోగం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది : 
అతిగా చేస్తే ఏదైనా ప్రమాదమే. హద్దు దాటి తాగితే నీళ్ళు కూడా విషమే. హద్దుల్లో ఉన్నంతవరకు శరీరానికి హస్తప్రయాగం లాభాలే తెచ్చపెడుతుంది తప్ప నష్టాలు మోసుకురాదు. కాకపోతే ఈ అలవాటు వ్యసనంలా మారితే మానసిక స్థితికి, ఏకాగ్రతకు ప్రమాదం.

హస్తప్రయోగం వలన సెక్స్ మీద ఇంటరెస్ట్ తగ్గిపోతుంది :

హస్తప్రయోగం వలన సెక్స్ మీద ఆసక్తి పెరుగుతుంది తప్ప తగ్గదు. హస్తప్రయోగం వలన జననాంగాల పట్ల ఆసక్తి, ఇష్టంతో పాటు జ్ఞానం పెరుగుతుంది.
హస్తప్రయోగం కేవలం మగవాళ్ళే చేస్తారు :
చాలా తప్పు. ఆడవాళ్ళకి కూడా ఈ అలవాటు ఉంటుంది. సమాజంలో ఉన్న వ్యవహార శైలి వలన బయటపడరు అంతే.
హస్తప్రయోగం యుక్త వయస్సులోనే చేయాలి :
అలా ఏం ఉండదు. వయసు, శరీరం సహకరించినంత వరకు హస్తప్రయోగం చేసుకోవచ్చు.

అందరికీ షేర్ చెయండి


loading...