News and Entertainment

భార్య అందంగా ఉందనీ... తాగొచ్చి ముక్కు కొరికేసిన భర్త..


అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త సైకోలా మారాడు. అనుమానంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఈ దారుణ ఘటన అరాచకాలకు అడ్డాగా మారిన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే...

షహజాన్‌పూర్‌కు చెందిన సంజీవ్ రాథోడ్, కమలేశ్ దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ఆరేళ్ల పాప ఉంది. పెళ్లయిన మొదటి రోజు నుండే భార్యను అనుమానించేవాడు. ఆ అనుమానంతోనే ప్రతిరోజూ భార్యతో గొడవపడేవాడు. ఒక రోజు ఉదయన్నేఅతడి భార్య వేరే వ్యక్తితో ఫొన్లో మాట్లాడుతోంది. ఆ విషయం గమనించిన సంజీవ్ తాగొచ్చి ఆమెతో గొడవపడ్డాడు.

అందంగా ఉంది కాబట్టే వేరే వాళ్లతో మాట్లాడుతుందని కాబోలని పొరబడ్డాడు. అదే ఆమె అందవిహీనంగా ఉంటే ఈ సమస్యే ఉండదనుకొని భావించి... ఆమెతో పొట్లాడుతున్న క్రమంలో ముక్కును కొరికేశాడు. ఆమె అరుపులు కేకలు విన్న పొరుగింటి వారు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. తమ కుమార్తె ముక్కును అల్లుడు కొరికేశాడనే విషయం తెలిసిన కమలేశ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.
షేర్ చేయండి


loading...