News and Entertainment

ఫేస్‌బుక్‌ పరిచయం.. పుట్టిన రోజు వేడుకలో రేప్‌


ప్రస్తుత యువత ఫేస్‌బుక్‌ వెంట పరుగులు తీస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ముక్కు మొహం తెలియని వారితో స్నేహం చేస్తూ ఎందరో మోస పోయినట్లుగా ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది మోస పోతూనే ఉన్నా కూడా ఇంకా కొందరు ఫేస్‌బుక్‌ పరిచయాలు పెంచుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో మరో ఫేస్‌బుక్‌ రేప్‌ జరిగింది. బెంగళూరుకు చెందిన అమ్మాయిని అదే బెంగళూరుకు చెందిన అబ్బాయి దారుణంగా మోసం చేసి రేప్‌ చేశాడు. 

బెంగళూరు సిటీకి చెందిన 16 సంవత్సరాల అమ్మాయికి ఆరు నెలల క్రితం డానియల్‌(24) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారిద్దరు చాలా అన్యోన్యంగా మాట్లాడుకునే వారు. ప్రతి రోజు కూడా ఛాటింగ్‌ చేసుకోవడం మరియు మాట్లాడుకోవడం చేసేవారు. వీరిద్దరి పరిచయం కాస్త డైరెక్ట్‌ కలవడం వరకు వచ్చింది. ఆమెను చూసి మనసు పడ్డ డానియల్‌ ఆమెను అనుభవించాలని కోరుకున్నాడు. అందుకోసం ఒక మాస్టర్‌ ప్లాన్‌ను వేశాడు. తన పుట్టిన రోజు అంటూ కొందరిని ఆహ్వానించాడు. 

అందరితో పాటు తన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ను కూడా ఆహ్వానించాడు. అందరితో పాటు పార్టీలో పాల్గొన్న ఆ అమ్మాయికి ఆమెకు తెలియకుండా మత్తు మందు ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన ఆమెను పార్టీ అయిపోయిన తర్వాత రేప్‌ చేశాడు. ఆమెతో చేసిన రొమాన్స్‌ను డానియల్‌ తన మొబైల్‌తో షూట్‌ చేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతా అంటూ హెచ్చరించాడు. అయినా కూడా ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డానియల్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. 
అందరికీ షేర్ చెయండి

loading...