News and Entertainment

తాగిన మత్తులో ఇండియన్స్ మాట్లాడే 10 ఫన్నీ మాటలు


భారతీయ పురుషులకీ, మద్యానికీ అవినాభావ సంబంధం ఉన్నట్లే ఉంది.1955 లో వచ్చిన దేవదాసు సినిమాలో హీరో విరహ వేదనతో మద్యానికి బానిసవుతాడు. అలాంటి సినిమాల్లో డైలాగులు ఆణి ముత్యాలనచ్చు. భగ్నప్రేమి కులకీ మద్యం పర్యాయ పదంగా మారడానికి ఆ సినిమా దోహదం చేసిందో లేదో కానీ భగ్న ప్రేమికులు చాలా మంది మద్యం తీసుకోవడానికి దేవదాసు కారణమయ్యాడని మాత్రం చెప్పచ్చు.మగవారికి పార్టీలంటే మందు మాత్రమే.

అమితాబ్ నటించిన ‘అమర్-అక్బర్-ఆంటోనీ’ కానీ షారుఖ్ నటించిన దేవదాసు కానీ చూస్తే దానిలో వారు మద్యం తీసుకున్నప్పుడు చెప్పే డైలాగులు అద్భుతం.అలా నిషాలో చెప్పే మాటలు కొన్ని నవ్వు తెప్పించినా కొన్ని కన్నీరు పెట్టిస్తాయి.
సినిమాల్లో పుట్టి పెరిగిన భారతీయ పురుషులు మద్యం తీసుకోగానే ఒక సినిమా డైలాగ్ చెప్పడమో లేక అన్ని వివరాలతో ఒక బాధాకరమైన సంఘటనని దోస్తులతో పంచుకోవడం లేదా కనీసం ఓ పాట పాడతారు.మద్యం త్రాగినప్పుడు సౌభ్రాతృత్వం వెల్లివిరిసి గత సంఘటనలన్నీ బయటకొస్తాయి.

తాము బాగా నషాలో ఉన్నామని ఎవ్వరూ ఒప్పుకోకపోయినా వారు నషాలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలని చూస్తేనే అర్ధమవుతుంది. నషాలో ఉన్న చాలా మంది మాట్లాడే మాటలు క్రింద ఇచ్చాము చూడండి. కానీ మద్యం తీసుకోగానే నషాలోకి జారిపోవడం అన్నది మనిషి మనిషికీ మారుతుంది కాబట్టి నషాలో వారు చెప్పే క్రింద ఇచ్చే మాటలు అందరూ అదే క్రమంలో చెప్పకపోయినా దాదాపు ఇవే మాట్లాడతారు.



  • నషాలో ఉన్నప్పుడు భావోద్వేగ పాటలు వినగానే భారతీయ పురుషులు చిన్న పిల్లలలాగ ఏడుస్తారు.తమ గతానుభవాలని పాట సాహిత్యంతో పోల్చుకుని గతానుభవాలు కూడా అచ్చం అలాగే ఉన్నాయని చెప్తారు.
PAGES:
1   2   3   4   5


loading...