News and Entertainment

అమ‌రావ‌తిలో సినీ ఆర్టిస్టుల‌తో కాస్ట్‌లీ వ్య‌భిచారం


నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతంలో రియ‌ల్ భూమ్ విజృంభించ‌డంతో పాటు వ్యాపారాలు బాగా పెర‌గ‌డంతో ఎవరికి వారికి డ‌బ్బులు పెద్ద ఎత్తున చేతుల్లోకి వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇక రాజ‌ధాని ప్రాంతం కావ‌డంతో ధ‌న‌వంతులు, పారిశ్రామిక‌వేత్త‌లు, బ‌డా బాబులు అంద‌రూ ఇక్క‌డ స్థిర‌ప‌డేందుకు రెడీ అవుతున్నారు. ఇక్క‌డ అపార్ట్‌మెంట్ల క‌ల్చ‌ర్ కూడా బాగా పెరిగిపోతోంది.

ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ బ‌డా బాబులు,రాజ‌కీయ నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ కొంద‌రు హైటెక్ వ్య‌భిచారానికి తెర‌దీస్తున్నారు. ఈ ఏరియాలో ఎంతో మంది ధనవంతులు వచ్చి నివాసం ఉంటుండటంతో, ఎంపిక చేసుకున్న వారికి వాట్స్ యాప్ తదితర సామాజిక మాధ్యమాలు వేదికగా, అమ్మాయిల ఫోటోలను పంపించి హైటెక్ సెక్స్ రాకెట్ కు తెరదీశారు. టెక్నాలజీని వారి దందాకు వాడుకుంటున్నారు.

ముందుగా వారికి ఫోన్లో అమ్మాయి ఫొటో పంపిస్తారు.. అమ్మాయి న‌చ్చితే వారు చెప్పిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మంగళగిరి, సీతానగరం, తాడేపల్లి వంటి ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి, వారు చెప్పిన అపార్ట మెంట్ కు వెళ్లి ఎంచుకున్న అమ్మాయితో ఒప్పందం ప్రకారం, గంటో, రెండు గంటలో గడపొచ్చు.

అమ్మాయిని వేరే చోట‌కు తీసుకు వెళ్లాల‌న్నా ఓకే . అయితే ఇందుకు గంట‌కు రేటు రూ.10 వేల వ‌ర‌కు ఉండ‌నుంది. గతంలో బీజేపీలో ఉండి వ్యభిచారం కేసుల్లో చిక్కుకున్న ఓ మహిళ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి, నేతల అండతో ఈ దందా సాగిస్తున్నట్టు స‌మాచారం.

ముంబయి మోడళ్లతోపాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పూణే, నాగాలాండ్ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సినీ, టీవీ ఆర్టిస్టులను కూడా ఆమె పిలిపించి వ్యాపారం చేయిస్తున్నారు. మోడళ్లను ప్రత్యేకంగా పిలిపించి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల వద్దకు పంపిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక చాలా మంది రాజకీయ నాయకులు తమ విందు, వినోదాలకు మోడళ్లను పంపాలని సదురు మహిళను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది.
షేర్ చేయండి


loading...